గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

గాయకుడు మనో ఇద్దరు కుమారులపై కేసు నమోదు

Singer Mano
మద్యం మత్తులో ఇద్దరు యువకులపై దాడిచేసి పరారీలో ఉన్న సినీ నేపథ్యం గాయకుడు మనో ఇద్దరు కుమారులపై చెన్నై వలసరవాక్కం పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, పరారీలో ఉన్న ఇద్దరు పోలీసు కోసం గాలిస్తున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్, మదురవాయల్‌కు చెందిన 16 యేళ్ల బాలుడు వలసరవాక్కం శ్రీదేవికుప్పంలోని ఫుట్‌బాల్ అకాడెమీలో శిక్షణ తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి శిక్షణ పూర్తి చేసుకుని స్థానికంగా ఉన్న హోటల్లో టిఫిన్ చేశారు. ఆ సమయంలో గాయకుడు మనో కుమారుడు సహా ఐదుగురు మద్యం మత్తులో కృపాకరన్, 16 ఏళ్ల బాలుడితో గొడవపడి దాడి చేసినట్లు తెలిసింది. 
 
గాయపడిన కృపాకరన్ కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. అతని ఫిర్యాదు మేరకు వళసరవాక్కం పోలీసులు గాయకుడు మనో కుమారులు రఫిక్, సాహీర్, వారి స్నేహితులు ముగ్గురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మనో ఇద్దరు కుమారులు, మరో స్నేహితుడి కోసం గాలిస్తున్నారు. మనో కుమారులు మద్యం మత్తులో అసభ్యకరంగా మాట్లాడి, దాడికి పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.