మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (17:46 IST)

ఆగమ్ బా యూట్యూబర్ గోల్డ్ ప్లే బటన్‌ను అన్ బాక్స్ చేసిన తరుణ్ భాస్కర్‌

Tarun Bhaskar, Agam Baa
Tarun Bhaskar, Agam Baa
ప్రముఖ యూట్యూబర్ ఆగమ్ బా తన ఐడియల్ దర్శక, నిర్మాత తరుణ్ భాస్కర్‌ను కలిశాడు. తన ఛానెల్‌కు వచ్చిన గోల్డ్ ప్లే బటన్‌ను తరుణ్ భాస్కర్ అన్‌బాక్స్ చేశారు. తరుణ్ భాస్కర్ బర్త్ డే సందర్భంగా ఇలా అన్ బాక్స్ చేయించారు. డిసెంబర్ 2023లో గోల్డ్ ప్లే బటన్‌ను అందుకున్న యూట్యూబర్, దానిని ఆవిష్కరించడానికి ప్రత్యేక సందర్భం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. అలా దాదాపు ఒక సంవత్సరం పాటు ఎదురుచూశారు. 
 
తరుణ్ భాస్కర్ సన్నిహిత మిత్రుడు కౌశిక్ ద్వారా ఆయన బర్త్ డే పార్టీకి వెళ్లడం, అక్కడ ఇలా సర్ ప్రైజింగ్‌గా తరుణ్ భాస్కర్ తో తన గోల్డ్ ప్లే బటన్‌ను ఆవిష్కరింపజేయడంతో సదరు యూట్యూబర్ సంతోషంలో తేలిపోయాడు. తరుణ్ భాస్కర్ నటించిన కీడ కోలాలోని నాయుడు పాత్రకు సంబంధించిన లుక్‌లో ఈ యూట్యూబర్ దర్శనం ఇచ్చాడు. అంటే తరుణ్ భాస్కర్ అంటే అతనికి ఎంత ఇష్టమే అక్కడే అర్థం అవుతుంది. తరుణ్ భాస్కర్ స్వయంగా వేదికపై గోల్డ్ ప్లే బటన్‌ను అన్‌బాక్స్ చేసి అతడి కృషి, పట్టుదలను అభినందించారు.