శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (09:31 IST)

టెలివిజన్ సెన్సేషన్ రక్ష్ రామ్, చేతన్ కుమార్ బర్మా చిత్రం

Bura launch
Bura launch
'గట్టిమెల', 'పుట్టగౌరి మదువే' వంటి హిట్ టీవీ షోస్ లో తన అద్భుతమైన నటనతో స్మాల్ స్క్రీన్‌ ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న వెరీ ట్యాలెంటెడ్ రక్ష్‌రామ్..  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌ 'బర్మా' తో వెండితెర ఎంట్రీ ఇస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో ఈ చిత్రం  పాన్ ఇండియాగా విడుదల కానుంది
 
పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం 'బహద్దూర్', 'భర్జరి', 'భారతే' , 'జేమ్స్' వంటి  కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌లు అందించిన దర్శకుడు చేతన్ కుమార్ బర్మాకు దర్శకత్వం వహిస్తున్నారు.
 
బర్మా ముహూర్తం వేడుక బసవంగుడిలోని దొడ్డ గణపతి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. అశ్విని పునీత్ రాజ్‌కుమార్ క్లాప్‌ను అందించగా, రాఘవేంద్ర రాజ్‌కుమార్  కెమెరా స్విచ్చాన్‌ను చేశారు. యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు.
 
బర్మాలో ఆదిత్య మీనన్, దీపక్ శెట్టి ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు.  
 
బర్మా అక్టోబర్‌లో ప్రొడక్షన్‌లోకి వెళ్లనుంది.  ప్రాజెక్ట్  స్టార్ కాస్ట్, ఇతర కీలక అంశాల గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.