గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 జనవరి 2022 (17:03 IST)

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు కరోనా

కరోనా వైరస్ కల్లోలం సృష్టింది. ఈ వైరస్ బారినపడుతున్న సినీ సెలబ్రిటీల సంఖ్య విపరీతంగా పెరిగిపోంది. తాజాగా తెలుగు హీరో, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ వైరస్ బారినపడ్డారు. ఇప్పటికే సూపర స్టార్ మహేష్ బాబుకు ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే. 
 
తాజాగా రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ వైరస్ కోరల్లో చిక్కారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇటీవల రాజేంద్ర ప్రసాద్ నటించిన "సేనాపతి" చిత్రం ఆహా ఓటీటీలో రిలీజైన విషయం తెల్సిందే.