శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (10:30 IST)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న హీరో సాయిధరమ్ తేజ్

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్ త్వరలో డిశ్చార్జ్ కానున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. దీంతో మరో రెండు మూడు రోజులులో డిశ్చార్జ్ కానున్నారు. 
 
ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్‌ తొలగించినట్లు వైద్యబృందం సోమవారం వెల్లడించింది. మూడు రోజుల కిందటే ఆయన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామంది. సొంతంగానే శ్వాస తీసుకుంటున్న సాయిధరమ్‌.. అందరితో మాట్లాడగలుగుతున్నట్టు సమాచారం. 
 
మరో రెండు, మూడురోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నట్లు పేర్కొంది. ఈనెల 10న దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి మీద నుంచి వెళ్తూ బైక్‌ స్కిడ్‌ అయి సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.