శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2015 (11:17 IST)

కొరియన్‌ సినిమాల్ని కాపీ కొట్టేస్తున్నారా? శ్రీమంతుడు కూడా అలాంటిదేనా?

చాలామటుకు తెలుగు దర్శకులు కొరియన్‌ సినిమాలు చూసి కాపీ చేస్తుంటారనే టాక్‌ వుంది. మరికొందరు చైనా చిత్రాలు కూడా తీస్తుంటారు. ఏదిఏమైనా సెంటిమెంట్‌ జోడించి. ఫ్రెష్‌ లుక్‌తో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. 'మనం' సినిమా ఎటువంటి కాంట్రవర్సీలేకపోయినా.. సోగ్గాడే.. సినిమాకు కాంట్రవర్సీ వచ్చింది. ఆత్మ కథలపై నాగార్జున పడ్డాడు. సరిగ్గా అంటి కదే అని ఫిలింనగర్‌లో కథనాలు విన్పిస్తున్నాయి.
 
తండ్రి ఆత్మ కొడుక్కి కనిపించి, అతని ద్వారా పగ తీర్చుకోవడం. నిజానికి మనవాళ్లకు పొరుగింటి పుల్ల కూర రుచి కానీ, ఇదేమీ పెద్ద కొత్త పాయింట్‌ కాదు. తండ్రి పగను కొడుకు తీర్చడం పాత పాయింటే. ఆత్మ వేరే వాళ్లకి కనిపించి వ్యవహారం నడిపించడమూ తెలుగులో పాత పాయింటే. సుమన్‌ గతంలో ఇలాంటి సినిమాలో నటించాడు. ఏనాడో వచ్చిన శభాష్‌ పాపయ్య సినిమా కూడా ఇలాంటిదే. 
 
అయితే.. హలో బ్రదర్‌ లాంటి ఎంటర్‌ టైనర్‌ మోడల్‌ ఇప్పుడు తను నటిస్తున్న సినిమా కథను మార్చినట్లు తెలుస్తోంది. కొన్ని సీన్లు రీష్యూట్‌ కూడా చేశారని సమాచారం. ఇదంతా ఓ కొరియన్‌ సినిమాకు స్పూర్తిగా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికిముందే.. శ్రీమంతుడు సినిమాకూడా ఓ వారపత్రికలో ప్రచురించిన నవలగా ఓ రచయిత పేర్కొన్నాడు. కానీ అప్పటికే రచయిత హక్కులు కోల్పోవడంతో కిమ్మనకుండా వున్నాడని తెలుస్తోంది. అలాగే సోగ్గాడే.. రిలీజ్‌ తర్వాత ఎటువంటి కామెంట్లు వస్తాయో చూడాల్సిందే.