గురువారం, 16 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2024 (17:55 IST)

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

TG Vishwa Prasad and harikatha team
TG Vishwa Prasad and harikatha team
వెర్సటైల్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, దివి, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో ‘హరికథ’ వెబ్ సిరీస్ గత వారం విడుదలైన సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై 'టీజీ విశ్వ ప్రసాద్' నిర్మించారు. ఈ వెబ్ సిరీస్‌కు 'మ్యాగీ' దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ డిసెంబర్ 13న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలై ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది.
 
హరికథ సిరీస్‌లోని స్క్రీన్ ప్లే, గ్రిప్పింగ్ కథనం, మాటలు, విజువల్స్ ఇలా క్రాఫ్ట్స్ గురించి ఆడియెన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ప్రేక్షకులు, విమర్శకుల నుండి అద్భుతమైన స్పందన రావడంతో పాటు, ఈ సిరీస్ ఓటిటిలో ట్రెండ్ అవుతూ ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకుంటోంది.
 
ఇంత అద్భుతమైన విజయం సాధించిన క్రమంలో నిర్మాత  'టీజీ విశ్వ ప్రసాద్' ఆదివారం రాత్రి 'హరికథ' టీంతో కలిసి గ్రాండ్ సక్సెస్ పార్టీని నిర్వహించారు. ఈ వెబ్ సిరీస్‌కు తమ నటనతో ప్రాణం పోసిన దివి, రుచిర సాదినేని, శ్రీమతి విక్రమ్, తేజ కాకమాను, భాను ప్రకాష్, నవీన్ రాజ్, ఉషా శ్రీ మరియు క్రూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శశి కిరణ్ నారాయణ తదితరులు మొత్తం ఈ పార్టీలో పాల్గొన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్రాండ్ వ్యాల్యూ పెంచేలా ఈ హరికథ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతోంది.