శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By JSK
Last Modified: శనివారం, 15 అక్టోబరు 2016 (19:21 IST)

థాయ్ రాణి... కాదు! క‌బాలీ ఫ్యాన్!!

చెన్న‌ై: ర‌జ‌నీ అంటే, ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర లేదు. కానీ, ఒక సామ‌న్య బ‌స్ కండ‌క్ట‌ర్... సూపర్ స్టార్‌గా మారితే... ఆయ‌న్ని చూసేందుకు, ఆయ‌న‌తో క‌లిసి మాట్లాడేందుకు రాజులు, రాణులు కూడా త‌హ‌త‌హ‌లాడతార‌ని మాత్రం ఈ సంఘ

చెన్న‌ై: ర‌జ‌నీ అంటే, ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర లేదు. కానీ, ఒక సామ‌న్య బ‌స్ కండ‌క్ట‌ర్... సూపర్ స్టార్‌గా మారితే... ఆయ‌న్ని చూసేందుకు, ఆయ‌న‌తో క‌లిసి మాట్లాడేందుకు రాజులు, రాణులు కూడా త‌హ‌త‌హ‌లాడతార‌ని మాత్రం ఈ సంఘ‌ట‌న చూస్తే, అర్థమవుతుంది. 
 
థాయిలాండ్ రాణి లాంగ్ రాజ‌ద‌ర‌శ్రీ జ‌యంకురా ప్ర‌త్యేకంగా ర‌జ‌నీకాంత్‌ను చెన్న‌ైలో ఆయ‌న స్వ‌గృహానికి వ‌చ్చి క‌లిశారు. అర‌గంట పాటు ఆమె ర‌జ‌నీతో స‌మావేశమయ్యారు. పైగా క‌బాలీ షూటింగ్‌లో కీల‌క భాగాల‌న్నీ థాయ్‌ల్యాండ్‌లో తీశారు. ఈ సినిమాతో క‌బాలీ క్రేజ్ థాయ్ ల్యాండ్‌లో కూడా బాగా పెరిగిపోయింది. అదీ సూప‌ర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ స్టామినా.