శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 మే 2017 (18:06 IST)

రజనీకాంత్ సరసన విద్యాబాలన్ లేదు.. హుమా ఖురేషికి బంపర్ ఛాన్స్..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో ఫోటోలు దిగుతూ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సినిమాల్లోనూ నటించనున్నారు. ఇప్పటికే రజనీకాంత్-రంజిత్ కాంబోలో వచ్చిన కబాలి సినిమాకు భార

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో ఫోటోలు దిగుతూ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సినిమాల్లోనూ నటించనున్నారు. ఇప్పటికే రజనీకాంత్-రంజిత్ కాంబోలో వచ్చిన కబాలి సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే కాంబోలో మరో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.
 
ఇప్పటికే రజనీకాంత్ సరసన బాలీవుడ్ భామలు ఐశ్వర్యారాయ్, సోనాక్షి సిన్హా, రాధికా ఆప్టేలు నటించారు. తాజాగా రంజిత్-రజనీ చిత్రంలో విద్యాబాలన్ నటిస్తున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగింది. కానీ విద్యాబాలన్ ఈ సినిమా నుంచి తప్పుకుందని.. రజనీ సరసన నటించేందుకు హుమా ఖురేషిని ఎంపిక చేశారని టాక్ వస్తోంది. కాగా ఈ చిత్రం ఈ నెల 28న లాంఛనంగా ప్రారంభం కానుంది.