శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (14:28 IST)

మెగా టైటిల్‌తో తమిళ సూపర్ స్టార్ విజయ్.. ఫస్ట్ లుక్ అదుర్స్.. వైరల్

తమిళంలో సూపర్‌స్టార్ అయిన దళపతి విజయ్‌కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న దళపతి64 సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా కొద్దిరోజులుగా ఈ టైటిల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు మాస్టర్ అనే టైటిల్‌ను అనౌన్స్ చేయడంతో పాటుగా న్యూఇయర్ కానుకగా ఓ ఫోటోను కూడా విడుదల చేశారు. ఇక ఈ టైటిల్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
ఇక ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే భారతదేశం మొత్తంలో ఇది ట్రెండింగ్‌గా మారింది. ట్విట్టర్‌లో 1000k మంది ట్వీట్ చేయగా, సామాజిక మీడియాలో ఈ సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుందని, ఇందులో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్‌గా నటిస్తున్నారని పలువార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఎంతో విభిన్నంగా తీర్చిదిద్దుతున్న ఈ పాత్రలో విజయ్‌ను సెకండ్ లుక్‌లో విడుదల చేయాలని భావిస్తోంది చిత్ర యూనిట్.