సోమవారం, 10 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : శుక్రవారం, 7 మార్చి 2025 (17:06 IST)

మంచి సందేశాన్ని ఇచ్చే బందీని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్ : ఆదిత్య ఓం

Aditya Om, Raghu Tirumala, Prasanna Kumar
Aditya Om, Raghu Tirumala, Prasanna Kumar
విలక్షణ నటుడు ఆదిత్య ఓం బందీ అనే చిత్రంతో గత వారం ఆడియెన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే.రఘు తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గల్లీ సినిమా బ్యానర్‌పై నిర్మించారు.  ఈ మూవీకి థియేటర్లో ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బందీ మంచి విజయాన్ని సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
 
 ఆదిత్య ఓం మాట్లాడుతూ.. ‘బందీ సినిమాను అందరూ ఆదరిస్తున్నారు. మీడియా ఇంకా సపోర్ట్ చేస్తే మరింత మందికి చేరుతుంది. ప్రస్తుతం పర్యావరణ అసమతుల్యత వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. మంచి సందేశాన్ని ఇచ్చే బందీని ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేస్తాను. మా సినిమాను ఇంతలా ఆదరించి సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
 
 తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ,  పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమాకు ఇంకా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఆదిత్య ఓం ఎంతో విలక్షణ నటుడు. యూపీ నుంచి ఇక్కడకు వచ్చి తన ప్యాషన్‌తో పని చేస్తున్నారు. బందీ విజువల్స్, కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. రఘు తిరుమల మంచి పాయింట్‌తో సినిమాను చేశారు. అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం మరింత ముందుకు వెళ్లాలి. కమర్షియల్‌గా బందీ సినిమా ఆడటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
 
రఘు తిరుమల మాట్లాడుతూ.. ‘మా లాంటి కొత్త వాళ్లని ఆదిత్య ఓం గారు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన సహకారంతోనే ఈ మూవీని ఇంత బాగా తీయగలిగాం. ఆయన లేకపోతే ఈ సినిమానే లేదు. వెంకటేశ్వర రావు దగ్గు ఈ మూవీని చూసి ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఈ సినిమాలో మ్యూజిక్, విజువల్స్ గురించి అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.