ఆ హీరోను తెలివిగా నొక్కేశారు!
సినిమా అన్నాక చాలా లెక్కలు వుంటాయి. చిన్న చిన్న పాత్రలు వేయాలంటేనే లెక్కలుంటాయి. డిపార్ల్‌మెంట్‌లో ఎవరినైనా బతిమాలో బామాలో కొందరు నటనా తృష్ణను బయట పెడుతుంటారు. ఇక హీరోల సంగతి సరేసరి. కొత్తగా వచ్చే హీరోకు చుక్కలే కనిపిస్తాయి. ఆఫీసు బాయ్ దగ్గర నుంచి ఎడిటర్ వరకు, పీఆర్వో నుంచి ప్రొడక్షన్ మేనేజర్ వరకు అందరితోనూ సఖ్యంగా వుండాల్సి వస్తుంది. కొందరిని నమ్మాల్ని వస్తుంది. కానీ నమ్మినవారే మోసం చేస్తే ఎలా అనేది ఇండ్రస్టీలో తెలుసుకుని మరి రావాల్సివుంటుందని గ్రహించాల్సివుంటుంది. తాజాగా ఆ మధ్య ఓ హీరో తన సత్తాను చాటుకుందామనుకుని ప్రతి ఇంటింటికీ తెలిసిన నటుడు వెండితెరపై వచ్చాడు. కొన్ని పాత్రలు కూడా చేశాడు. హీరోగా పెద్ద సంస్థలో బుక్ అయ్యాడు.
సినిమా రిలీజ్ కుముందు ప్రచారానికి సిద్ధమయ్యాడు. వెంటనే పెద్ద సంస్థ అధినేతగానీ, ప్రచారాన్ని నిర్వహించే వ్యక్తిగానీ ఆయనకు ఫల్ సపోర్ట్గా నిలుస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ అసలు తెరవెనుక జరిగింది వేరే. ప్రచారం ఎలా చేయాలో అనే విషయం పెద్దగా తెలీని ఆ హీరోను వీరంతా మాయ చేశారు. పైకి మాత్రం ప్రచారం జరుగుతున్నట్లే వుంది. ఎక్కడా సరైన పబ్లిసిటీకనిపించలేదు. చివరికి రిలీజ్‌కుముందునాడే షో వేస్తే, చూడ్డానికి ఆహ్వానితులు పెద్దగా రాలేదు. వచ్చిన వారు సినిమా బాగుంది. బాగా ప్రమోషన్ చేయండని సలహా ఇచ్చారు. ఇక విడుదలకు సరైన థియేటర్ రొరకలేదు. ఆ తర్వాత ఆ సినిమా గురించి అందరూ చేతులు ఎత్తేశారు. దాంతో ఆ హీరోకు జ్ఞానోదం అయింది. ఈ రంగంలో నిలబడాలంటే మన వెనుక తోపు అనేవాడు ఒకడుండాలని. లేదంటే ఎంత ఖర్చుపెట్టినా లాభంలేదు అనే అనుభవం మాత్రం మిగిలింది.