సాయిపల్లవి 2 కోట్లు వదులుకోవడానికి కారణమిదే!
నటి సాయిపల్లవి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. `ఫిదా` సినిమాలో నటించడానికి శేఖర్ కమ్ముల మరో హీరోయిన్‌ను వెతుక్కోకుండా ఆమె కోసం చాలా కాలం వేచి చూశాడు. అప్పుడు ఆమె తన చదువు ముగింపు దశలో వుంది. ఆ సినిమాలో ఆమె నటన ఒక భాగమైతే, ఆమె మొహంమీద పొక్కులు, మొటిమలు వంటివి వుండి బుగ్గ ఎర్రగా వుండేది. ఎందుకని ఈమె కేర్ తీసుకోదు అని చాలామంది అప్పట్లో కామెంట్ చేశారు.
దానికి తగిన సమాధానమే అన్నట్లు ఇటీవలే ఆమె ప్రవర్తన తెలియజేస్తుంది. తాజాగా ఆమెకు కమర్షియల్ యాడ్ ఫేషియల్ క్రీమ్ ఆఫర్ వచ్చింది. అందుకు ఆమెకు 2 కోట్లు ఇస్తామని వెల్లడించారు. కానీ తను సున్నితంగా తిరస్కరించింది. ప్రకృతి అందమే మహిళకు కావాలి. ఇలా ఫేస్‌కు రకరకాల క్రీమ్‌లు రాసుకుని దానివల్ల ఏదైనా ఇబ్బంది అయితే తను బాధ్యత వహించాల్సి వస్తుంది. సో.. నేను చేయను అని చెప్పింది. దానికి కారణం లేకపోలేదు. తను డాక్టర్ కావడంతో తన బాడీకి తనకు ఏవిధమైన మేకప్ కావాలో తనకు తెలుసునని వెల్లడిస్తోంది. షూటింగ్‌లో ఎక్కువగా మేకప్ వేసుకోనని అంటోంది. దేవుడిచ్చిన అందాన్ని అలాగే కాపాడుకోవాలంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది.