శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (22:40 IST)

ఆ సినిమా నా హ్యాపీడేస్ కు రిలేటివ్ గా అనిపించిందిః శేఖర్ కమ్ముల

Love story prerelease
నాగ చైతన్య, సాయి పల్లవి న‌టించిన‌ లవ్ స్టోరి ప్రీరిలీజ్ హైద‌రాబాద్‌లో ఆదివారం రాత్రి జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, మా లవ్ స్టోరి ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన మా సినిమా గురించి చెప్పిన మాటలు మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆయనకు మా టీమ్ తరుపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఇక అమీర్ ఖాన్ ను అభిమానించే వాళ్లలో నేనూ ఒకర్ని. ఆయన సినిమా ఖయామత్ తే ఖయామత్ తక్ చూసినప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అమీర్ ఖాన్ ఇలా గన్ పట్టుకుని డిఫరెంట్ సినిమా ఎలా చేయగలిగాడు అని ఆశ్చర్యపోయాను. నేను డాలర్ డ్రీమ్స్ సినిమా చేసి, దానికి నేషనల్ అవార్డ్ పొందాను. ఆ తర్వాత దిల్ చాహతా హై రిలీజైంది. అక్కడా యువత డ్రీమ్స్ కనిపిస్తాయి. ఎక్కడో మా సినిమాలకు తెలియని కనెక్షన్ ఉంది అనిపించింది. సర్ఫరోష్ సినిమా దర్శకుడు నాకు తెలిసిన మిత్రుడే. ఆయన మీకు కథ చెప్పి ఒప్పించి సినిమా చేశాడు. నేనూ ఒకరోజు మీకు కథ చెబుతాననే నమ్మకం కలిగింది. త్రీ ఇడియట్స్ చూశాక, నేను రూపొందించిన హ్యాపీడేస్ కు రిలేటివ్ గా అనిపించింది. అప్పుడు మీ సినిమాలకు నా సినిమాలకు ఎక్కడో తెలియని కనెక్షన్ ఏర్పడుతోంది అని భావించాను. 
 
అమీర్ ఖాన్ హోస్ట్ చేసిన సత్యమేవ జయతే కార్యక్రమం చూశాక..మీలా మరే స్టార్ సొసైటీ కోసం ఆలోచించలేరు అనిపించింది. భగవంతుడే మిమ్మల్ని ఇలా పని చేయిస్తున్నాడు అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే గర్వంగా అనిపిస్తుంటుంది. నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాను. సినిమాలకు ఏదో ఒక పర్పస్ ఉండాలని కోరుకుంటాను. సొసైటీకి ఏదో ఒక మంచి చెప్పాలనుకుంటాను. లీడర్ సినిమాలో నేనో డైలాగ్ రాశాను. అరవై ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా కుల వివక్ష ఉందని. ఆ డైలాగ్ నుంచి ఇన్ స్పైర్ అయి లవ్ స్టోరి చిత్రాన్ని తెరకెక్కించాను. లవ్ స్టోరి షూటింగ్ టైమ్ లో ఫస్ట్ వేవ్, రిలీజ్ టైమ్ లో సెకండ్ వేవ్ వచ్చాయి. ఈ కష్టంలోనూ మా సినిమా టీమ్ అంతా ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. వాళ్లందరికీ నా థాంక్స్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా చిత్రాన్ని థియేటర్ లోనే విడుదల చేయాలని నిర్ణయించిన నారాయణదాస్ నారంగ్ గారికి కృతజ్ఞతలు. లవ్ స్టోరి చిత్రాన్ని థియేటర్ లో చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.
 
నిజం కావడం నమ్మలేకపోతున్నాను
హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ, చిరంజీవి గారి సినిమాల్లో డాన్సులు చూసీ చూసీ నాకు అదే గ్రేస్ అలవాటు అయ్యింది. ఆయన నా డాన్సింగ్ టాలెంట్ గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అమీర్ ఖాన్ గారు నా సినిమా ఈవెంట్ కు వస్తారని కలలో కూడా అనుకోలేదు. కానీ ఇవాళ అది నిజం కావడం నమ్మలేకపోతున్నాను. అమీర్ ఖాన్ గారు ఎప్పుడూ మమ్మల్ని ఇన్ స్పైర్ చేస్తుంటారు. నేను విభిన్నమైన క్యారెక్టర్ కు న్యాయం చేయగలను అని దర్శకుడు శేఖర్ కమ్ముల గారు నమ్మడమే పెద్ద బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను. ఆయన డైరెక్షన్ లో నాకిది రెండో సినిమా. ఒక్కసారి శేఖర్ కమ్ముల గారి సినిమా సెట్ కు వెళ్తే ఎంత వినయంగా పనిచేయాలో, ఎంత ఒద్దికగా ఉండాలో తెలుస్తుంది. అదే ఎనర్జీతో నేను మిగతా చిత్రాల సెట్స్ కు వెళ్తుంటాను. ఈ టీమ్ తో మరో సినిమా వెంటనే చేయాలని కోరుకుంటున్నాను. నాగ చైతన్య వండర్ ఫుల్ కో స్టార్. ఆయనతో నటించడం ఎంతో సంతోషంగా ఉంది. శేఖర్ గారి చిత్రాల్లో సమాజానికి చెప్పేందుకు ఏదో ఒక విషయం ఉంటుంది. అలాగే ఇందులో అమ్మాయిలు చూసి తెలుసుకునేందుకు ఒక ముఖ్యమైన విషయం ఉంది. వాళ్లంతా లవ్ స్టోరి చూశాక, ఒక ఆలోచనతో ఇంటికి వెళ్తారు. మిమ్మల్ని మీరు వేసుకునే ఒక ప్రశ్నతో ఇంటికి వెళ్తారు. అన్నారు.
 
అది జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను
నాగ చైతన్య మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారికి నా కార్యక్రమానికి వచ్చినందుకు థాంక్స్. ఆయన సినిమాల్లో మెగాస్టార్, బయట మెగా హ్యూమన్ బీయింగ్. కరోనా పాండమిక్ టైమ్ లో ఎంతోమంది కార్మికులకు సాయం చేశారు. మీరు ఇండస్ట్రీకి ఇచ్చిన సపోర్ట్ ఇన్ స్పైరింగ్ గా ఉంది. లవ్ స్టోరి ట్రైలర్ చూసి అమీర్ ఖాన్ గారు మెసేజ్ చేశారు. సండే ఏంటి ప్రోగ్రాం అని ఆయన అడగగానే ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని చెప్పాను. నేను వస్తాను అన్నారు. ఆయన ఆ మాట అనగానే నమ్మలేకపోయాను. 45 రోజులు లాల్ సింగ్ చద్దా సినిమా కోసం అమీర్ ఖాన్ గారితో పనిచేశాను. ఆ టైమ్ లో నేను మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. అది జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మా అభిమానులను మిస్ అవుతున్నానని తెలుసు. కానీ పాండమిక్ పరిస్థితుల వల్ల కొంతమంది అభిమానులనే కలవగలుగుతున్నాను. 
 
చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇందులో వున్నాయి
లవ్ స్టోరి విషయానికి వస్తే, నేను ఇప్పటిదాకా ఏ సినిమాకూ ఇంత ఇన్ స్పైర్ కాలేదు, ఏ క్యారెక్టర్ ఇంత డెప్త్ లోకి వెళ్లి చేయలేదు. శేఖర్ కమ్ముల గారి వల్లే నేను ఇంత ఇన్ వాల్వ్ అయి లవ్ స్టోరి చిత్రంలో నటించగలిగాను. శేఖర్ గారి దర్శకత్వంలో పనిచేస్తున్నప్పుడు ఆయన కథ లో, క్యారెక్టర్ లో వెళ్లే డెప్త్ చూసి, ఈ మనిషి కోసం ఎంత దూరం అయినా వెళ్లొచ్చు అనిపించింది. ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ అయిన హీరోలకు ఎప్పుడూ చెబుతుంటాను దర్శకుడు శేఖర్ కమ్ముల గారితో అవకాశం వస్తే సినిమా వదులుకోకండి. ఆయనతో సినిమా చేశాక మంచి నటుడు అవుతారు, మంచి పర్సన్ అవుతారు, నేనూ అలాగే మారాను. మీరు ఏదీ నేర్పించలేదు. మేమే నేర్చుకున్నాం. ఒకట్రెండు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ శేఖర్ కమ్ముల గారు లవ్ స్టోరిలో చెప్పబోతున్నారు. అవి 24న థియేటర్ లో చూస్తారు. ఇలాంటి సినిమాలో నటించడం పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక సెన్సిటివ్ ఇష్యూను గురించి సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. మా దర్శకుడికి ఆ ధైర్యం ఉంది. ఏడాది ఏడాదిన్నరగా సినిమాను హోల్డ్ చేసిన నిర్మాతలకు థాంక్స్. మనం కలిసి మరిన్ని సినిమాలు చేయాలి. సాయి పల్లవి ఆన్ స్క్రీన్ నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చింది. 24న మా సినిమా విడుదల అవుతోంది. ఇదో మ్యాజిక్ డేట్ లా అనిపిస్తోంది. తాతగారి ప్రేమనగర్ 50 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైంది. మిమ్మల్ని థియేటర్స్ లో చూసేందుకు ఎదురుచూస్తున్నాను. అన్నారు.