మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 6 జులై 2021 (10:37 IST)

దాని కోసమే సమయాన్ని, డబ్బును ఖర్చు చేశాః తాప్సీ ప‌న్ను

Tapsi
`గత 7 సంవత్సరాలుగా ఒక‌ ప్రేక్షకుడిగా నన్ను నేను చూడాలనుకునే కథలలో భాగం కావాలని వెతుకుతున్నాను. దాని కోసం నేను నా సమయాన్ని, డబ్బును ఖర్చు చేశాను. `మిషన్ ఇంపాజిబుల్` అలాంటి చిత్రాల్లో ఒక‌టి`` అని తాప్సీ ప‌న్ను తెలియ‌జేసింది.
 
టాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఒక‌వైపు స్టార్ హీరోలతో హై బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూనే మ‌రోవైపు చిన్న- మధ్య తరహా బడ్జెట్‌లతో మంచి కంటెంట్ ఆధారిత చిత్రాలను కూడా రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ప‌తాకంపై `ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ఆర్ ఎస్ జె ద‌ర్శ‌కత్వంలో ప్రొడ‌క్ష‌న్ నెం.8గా ఓ చిత్రం రూపొందుతోంది.
 
2017లో వచ్చిన సూప‌ర్‌హిట్ ఫిల్మ్ `ఆనందో బ్రహ్మ` సినిమాలో చివ‌ర‌గా తెలుగు తెరపై కనిపించింది తాప్సీ. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ప‌లు ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న తాప్సీ తాజాగా మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో లీడ్‌రోల్‌లో న‌టిస్తోంది.
 
ఈ రోజు నుండి మిషన్ ఇంపాజిబుల్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు తాప్సీ. ఆమెకు గ్రాండ్ వెల్క‌మ్ చెప్పింది చిత్ర యూనిట్‌. అలాగే చేతికి క‌ట్టుతో ల్యాప్‌టాప్‌లో ఏదో సీరియ‌స్‌గా చూస్తున్న వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌.
 
`ఆకట్టుకునే కథాంశం మ‌రియు మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ లాంటి మంచి టీమ్ కావ‌డంతో ఈ చిత్రాన్ని ఎంచుకున్నాను. క్వాలిటీ  చిత్రాలను ఎన్నుకోవడంలో ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకాన్ని ఇలాంటి సినిమాల‌లో భాగం కావడం ద్వారా నేను ఖచ్చితంగా నిల‌బెట్టుకోగ‌ల‌ను అని న‌మ్ముతున్నాను`` అని తాప్సీ అన్నారు.
ఈ చిత్రానికి మిషన్ ఇంపాజిబుల్ అనే టైటిల్ తో పాటు ఇటీవ‌ల విడుద‌ల‌చేసిని థీమ్ పోస్ట‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ మూవీకి సంబందించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో మ‌న‌ముందుకు వ‌చ్చారు మేక‌ర్స్‌.
నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్ ఎం పాష అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌. దీప‌క్ య‌ర‌గ‌ర సినిమాటోగ్రాఫ‌ర్‌, మార్క్ కె రాబిన్ సంగీత ద‌ర్శ‌కుడు, ర‌వితేజ గిరిజ‌ల ఎడిట‌ర్‌.
 
సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌: మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్,  ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: స్వ‌రూప్ ఆర్ ఎస్ జె, నిర్మాత‌లు: నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, అసోసియేట్ ప్రొడ్యూస‌ర్: ఎన్ ఎం పాష, సినిమాటోగ్ర‌ఫి: దీప‌క్ య‌ర‌గ‌ర, సంగీతం: మార్క్ కె రాబిన్ఎ, డిట‌ర్‌: ర‌వితేజ గిరిజ‌ల  , ఆర్ట్: నాగేంద్ర‌, పిఆర్ఓ: వంశీ - శేఖ‌ర్