బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

హీరో రామ్ చరణ్‌కు అరుదైన గౌరవరం.. ది అకాడమీ నటుల జాబితాలో చోటు

ramcharan
"ఆర్ఆర్‌ఆర్" చిత్రం విషయంలో ఇది వరకే ఆస్కార్ అనౌన్స్ చేసిన తమ మెంబర్స్ ఆఫ్ క్లాస్ జాబితాలో ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా మరికొందరు ప్రముఖ నటుల లిస్ట్‌ని రిలీజ్ చేయగా అందులో అనేకమంది హాలీవుడ్ నటులతో పాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరుని కూడా పెట్టి తనని తమ సరికొత్త సభ్యునిగా ఆహ్వానిస్తున్నట్టుగా ఆస్కార్ అకాడమీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు వైరల్‌గా మారి తెలుగు సినిమాకి ఇండియన్ సినిమా యాక్టర్స్‌లో ప్రైడ్ మూమెంట్‌‌గా మారింది.
 
కాగా, మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. ఒకవైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు నిర్మాతగా కొనసాగుతున్నారు. తన తండ్రి హీరోగా పలు చిత్రాలు నిర్మించారు. అలాగే, తాను నటించే ప్రతి చిత్రాన్ని ఎంతో వైవిధ్య భరితంగా ఉండేలా ప్రత్యేక దృష్టిసారించారు.