బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 5 జూన్ 2021 (17:43 IST)

బ్ర‌హ్మీకి కోపం తెప్పించిన హ‌నుమంతుడు పుట్టుక‌

bramhanandam
క‌రోనా టైంలో అంద‌రూ నానా ఇబ్బందులు ప‌డుతుంటే తిరుమ‌లి తిరుప‌తి వారు హ‌నుమంతుని పుట్టుక గురించి చ‌ర్చ పెట్టారు. అస‌లు ఇది ఈ టైంలో అవ‌స‌ర‌మా? అని ఆ వార్త‌ను చూసిన‌వారికి క‌ల‌గ‌మాన‌దు. ఇప్పుడు అదే అభిప్రాయం సీనియ‌ర్ న‌టుడు బ్ర‌హ్మానందంకు వ‌చ్చింది.
 
హనుమంతుడి జన్మస్థలం గురించి తిరుమల తిరుపతి దేవస్థానం ఏడు కొండల్లోని అంజనాద్రి ఆంజనేయుడి జన్మస్థలమని ప్రకటించింది. దీనిపై కర్ణాటకలోని కిష్కింధ ట్రస్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసులు  హనుమంతుడి జన్మస్థలం కిష్కింధ అని వాదించింది. ఇరు పక్షాల మధ్య ఇటీవలే తిరుపతిలో చర్చ జరిగినప్పటికీ, రెండు వర్గాలు తుది నిర్ణయానికి రాలేకపోయాయి. హనుమంతుడి పై ఇలాంటి వివాదం చెలరేగడం పట్ల హిందూ భక్తులు ఎంతో బాధపడుతున్నారు.
 
ఈ వివాదంపై బ్రహ్మానందం ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చ‌ర్చ‌లో పాల్గొన్నారు. భక్తికి నిదర్శనం హనుమంతుడని, ఆయన ఎక్కడ పుట్టారనే విషయాన్ని వివాదాస్పదం చేయరాదని కోరారు. ఇలాంటి వివాదం ఏమాత్రం సమంజసం కాదని హిత‌వుప‌లికారు. హనుమంతుడు ఎక్కడ పుట్టారనే విషయంపై వాదనలు చేసుకోవడం మాని, ఆయన మన దేశంలో పుట్టారని గర్వపడితే బాగుంటుందని చెప్పారు.