సోమవారం, 18 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (17:01 IST)

ఇండో- ఫ్రెంచ్ సహకారంతో నిర్మిస్తున్న తొలి చిత్రం - తామర

Tamara poster
టాలీవుడ్ ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ తొలిసారిగా అంతర్జాతీయ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ. ‘తామర‘  పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. 
 
ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు అయిన రవి. కె. చంద్రన్ ఈ చిత్రానికి  దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల ‘భీమ్లా నాయక్‘  చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. దీనికి సంబంధించి విడుదల చేసిన ప్రచార చిత్రంలో ఓ అమ్మాయి తల ఓ పక్కకు తిప్పుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఇండో- ఫ్రెంచ్ కొలాబరేషన్ లో నిర్మితమవుతున్న ఈ ‘తామర‘ చిత్రం కథ కథనాలు అత్యంత ఉత్సుకతను కలిగిస్తాయని తెలుస్తోంది. 
 
సితార ఎంటర్ టైన్మెంట్స్  నిర్మించిన ‘జెర్సీ‘ చిత్రం జాతీయ పురస్కారం అందుకున్న నేపథ్యంలో ఇప్పుడీ అంతర్జాతీయ చిత్రం నిర్మాణం ప్రకటన సినీ వర్గాలలో అమితాసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగ వంశీ.