సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Modified: శనివారం, 27 ఫిబ్రవరి 2021 (23:05 IST)

టీజర్ రిలీజ్ కోసం వెళ్తే లాప్టాప్ నేలకేసి కొట్టిన హీరో

DIS poster
దేవి ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్లో రూపొందుతున్న చిత్రం (DIS) దొరకునా ఇటువంటి సేవ మూవీ టీం కు ఇలాంటి విచిత్రమైన సంఘటన ఎదురైంది. ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన పోస్టర్ గాని, టీజర్ గాని, ట్రైలర్ గాని సెలబ్రిటీస్తో రిలీజ్ చేయించడం ఆనవాయితీ అయిపోయింది. అదేవిధంగా ఈ మూవీ టీం కూడా టాలీవుడ్ హీరో ఒకరితో  టీజర్ రిలీజ్ చేయించడానికి వెళ్లి ఆ హీరోని కలిశారు. అక్కడ వాళ్ళకి ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. టీజర్ ఒకసారి చూస్తా అంటే చూపించారు. ఆ టీజర్ హీరో చూసిన వెంటనే కోపంతో లాప్టాప్ నేలకేసి కొట్టాడు. ఈ టీజర్ నేను రిలీజ్ చేయకపోవడమే కాదు ఎవరిని రిలీజ్ చేయనివ్వను గెట్ అవుట్ అని పూనకం వచ్చిన వాడిలా ప్రవర్తించాడట. 
 
ఈ సంఘటనపై DIS మూవీ టీం  మాట్లాడుతూ.. ఆ టీజర్ ని చూసి ఆ హీరో ఎందుకు అలా ప్రవర్తించాడో మాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఈ సినిమా అయితే ఒక passionate crime ఎలిమెంట్ తో చాలా ఎఫెక్టివ్ గా చేయడం జరిగింది..ఈ టీజర్ తప్పు చేయని వాళ్లకు కనెక్ట్ అవుతుంది.. తప్పు చేసే వాళ్లకు కు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతుంది..Passionate Crime చేసేవాళ్లకి ఈ DIS  సినిమా వార్నింగ్ లాంటిది.అని చెప్పారు.