ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (15:27 IST)

కరీనా కపూర్ భర్తను కిడ్నాప్ చేస్తానంటున్న పరిణీతి చోప్రా!

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్. ఆయనను బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ వివాహమాడింది. వీరిద్దరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే, మరో బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా మాత్రం సైఫ్ అలీఖాన్‌ను కిడ్నాప్ చేస్తానంటూ బెదిరింపులకు దిగుతోంది. ఇంతకీ పెళ్లై పిల్లలున్న హీరోను ఓ కుర్ర హీరోయిన్ కిడ్నాప్ చేస్తామని చెప్పడం వెనుక ఉన్న కారణాలన్ని ఇపుడు తెలుసుకుందాం. 
 
పరిణీతి చోప్రా తన 33వ పుట్టిన రోజు వేడుకలను గురువారం జరుపుకుంటున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ది కపిల్ శర్మ షోకు ఆమె హాజరైంది. ఈ కార్యక్రమంలో 'నిజ జీవితంలో ఒక వ్యక్తిని అపహరించడానికి అవకాశం ఇస్తే ఎవరిని అపహరిస్తార'ని పరిణీతికి ప్రశ్న ఎదురైంది. 
 
దీనికి ఆమె స్పందిస్తూ, 'ఒకరిని కలవడానికి నాకు అవకాశం రాక.. అతణ్ని కిడ్నాప్ చేయాల్సి వస్తే నేను సైఫ్ అలీఖాన్‌ను ఎంచుకుంటా. ఎందుకంటే నేను అతణ్ని చాలా ప్రేమిస్తున్నా. ఆ విషయం కరీనాకు కూడా చెప్పాను. నేను సైఫ్‌ను దూరం నుంచి ప్రేమిస్తాన'ని వివరించింది.