బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 22 మే 2021 (20:40 IST)

ప‌వ‌న్‌తో సినిమా నేనే ప్ర‌క‌టిస్తాః బండ్ల గ‌ణేష్‌

Bandla ganesh
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో నిర్మాత బండ్ల గ‌ణేష్‌కు అనుబందం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను దేవుడు అంటూ సంబోధిస్తుంటాడు. ఇద్ద‌రి మ‌ధ్య ఓ ద‌శ‌లో చెడింది అనే వార్త కూడా విస్త‌రించింది. ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో గ‌బ్బ‌ర్ సింగ్ వ‌చ్చింది. ఆ చిత్రం విజ‌యం త‌ర్వాత బండ్ల గ‌నేష్‌కూ ప‌వ‌న్‌కూ మ‌ధ్య పొర‌పొచ్చాలొచ్చాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి కూడా. కానీ ఎక్క‌డా ప‌వ‌న్‌ను త‌ను నిందించ‌లేదు. పైగా ప‌వ‌న్ అంటే నాలో ఎన‌ర్జీ వ‌స్తుంది అంటాడు.
 
ఇటీవ‌లే వకీల్‌సాబ్ ప్రీరిలీజ్ స‌మ‌యంలో కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంటే బండ్ల గ‌ణేష్ స్పీచ్ హైలైట్ అయింది. ముందుగా ప్రిపేర్ చేసుకుని వ‌చ్చిన‌ట్లుగా ఆయ‌న మాట్లాడిన విధానం, అందుకు ప‌వ‌న్ స్పందించిన తీరు అంద‌రికీ తెలిసిందే. తాజాగా ప‌వ‌న్‌తో బండ్ల గ‌ణేష్ సినిమా చేయ‌నున్నాడ‌ని వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది. దానిపై ఆయ‌న క్లారిటీ ఇచ్చాడు. మ‌ర‌లా గ‌బ్బ‌ర్ సింగ్ కాంబినేష‌న్ హ‌రీష్ శంక‌ర్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో నేను సినిమా చేస్తున్నాన‌ని కొన్నిచోట్ల రాస్తున్నారు. అందులో వాస్త‌వం లేదు. ఏదైనా వుంటే నేనే ఫైన‌ల్ చేసి చెబుతానంటున్నాడు. ఈ విష‌యాన్ని టిట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.