శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (17:03 IST)

శాకుంతలం నుంచి సెకండ్ సింగిల్ విడుదల కానుంది

Mukundan, Samantha
Mukundan, Samantha
ముకుందన్, సమంత నటించిన శాకుంతలం నుంచి సెకండ్ సింగిల్ విడుదల కానుంది. రుషివనంలోన అనే మెలోడీని ఐదు భాషల్లో జనవరి 25, 2023న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇదే పోస్టర్ పై ఫిబ్రవరి 17, 2023న విడుదల తేదీ వెల్లడించారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన, పౌరాణిక నాటకం ఇది. తను ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. నీలిమ నిర్మాత. 
 
ఇప్పటికే శాకుంతలం పై సమంత కూడా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో  మోహన్ బాబు, కబీర్ దుహన్ సింగ్, అదితి బాలన్, గౌతమి, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల మరియు అల్లు అర్హ కీలక పాత్రల్లో నటించారు. 2డి మరియు 3డి ఫార్మాట్లలో విడుదల కానున్న ఈ పాన్ ఇండియన్ మూవీని గుణ టీమ్‌వర్క్స్ ఆధ్వర్యంలో నిర్మించారు.