మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (16:59 IST)

ఆక‌ట్టుకుంటోన్న`పెళ్లిసంద‌D`లోని `ప్రేమంటే ఏంటి` సాంగ్‌

Roshan, srilela
పాతికేళ్లుగా `పెళ్లిసంద‌డి` పాట‌లు అంద‌రినీ అల‌రిస్తున్నాయి. మ‌ళ్లీ ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు, స్వ‌ర‌వాణి కీర‌వాణి కాంబినేష‌న్‌లో కొత్త `పెళ్లిసంద‌D` తొలిపాట` ప్రేమంటే ఏంటీ..` ఈ రోజు విడుద‌లై శ్రోత‌ల్ని ఆక‌ట్టుకుంటోంది. రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందిస్తున్న చిత్రం `పెళ్లిసంద‌D`. గౌరి రోనంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని నిర్మాత‌లు. దాదాపుగా షూటింగ్ పూర్తిచేసుకున్న‌ ఈ చిత్రం నుండి ఫ‌స్ట్ సోల్‌ఫుల్‌ సాంగ్ `ప్రేమంటే ఏంటీ`ని ఈ రోజు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.
 
`నువ్వంటే నాకు ధైర్యం నీనంటే నీకు స‌ర్వం..నీకు నాకు ప్రేమా, ప్రేమంటే ఏంటీ..చ‌ల్ల‌గా అల్లుకుంట‌ది  మెళ్లగా గిల్లుతుంట‌ది. వెళ్ల‌నే వెళ్ల‌నంట‌ది విడిపోనంటుంది..మ‌రి నువ్వంటే నాకు ప్రాణం నేనంటే నీకు లోకం నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి...``అంటూ ఆహ్లాద‌క‌రంగా సాగే ఈ పాట‌కు స్వ‌ర‌వాణి కీర‌వాణి క్యాచీ ట్యూన్‌ ఇవ్వ‌గా స్టార్ లిరిసిస్ట్‌ చంద్ర‌బోస్ అద్భుత‌మైన‌ సాహిత్యం అందించారు. హ‌రిచ‌రణ్‌, శ్వేత పండిట్ శ్రావ్యంగా ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. రొమాంటిక్ మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న‌`పెళ్లిసంద‌D` చిత్రంలోని `ప్రేమంటే ఏంటి` పాట‌తో  కె. రాఘ‌వేంద్ర‌రావు, కీర‌వాణిల పాట‌ల సంద‌డి మ‌ళ్లీ మొద‌లైంది. ఈ సినిమాలోని పాట‌లు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల‌వుతున్నాయి.  
 
రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
 
సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి
సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్
సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు
ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,
‌మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌
ఫైట్స్‌: వెంక‌ట్
కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు, 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా  కోవెల‌మూడి
స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌
నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని
ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ
ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోనంకి.