గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (20:08 IST)

అన్నీ మంచి శకునములే టైటిల్ నాకే సరిగ్గా వర్తిస్తుంది : అశ్వినీదత్

Ashwinidat, Santhosh Shobhan, Malavika Nair, Rajendra Prasad and others
Ashwinidat, Santhosh Shobhan, Malavika Nair, Rajendra Prasad and others
సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, గౌతమి, రావు రమేష్, నరేష్ వికె, బివి నందిని రెడ్డి, స్వప్న సినిమా.. క్రేజీ కాంబినేషన్. ‘అన్నీ మంచి శకునములే’ అనే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం వీరందరూ కలిసి పనిచేశారు. ఇప్పటికే విభిన్నమైన పాత్రలు చేసి తన ప్రతిభ చాటిన సంతోష్ శోభన్, నందిని రెడ్డి గత చిత్రం ఓ బేబీ బ్లాక్ బస్టర్ కాగా, స్వప్న సినిమాస్ ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, సీతా రామం వంటి క్లాసికల్ హిట్‌ లను అందించింది. ఇప్పటికే విడుదలైన ‘అన్నీ మంచి శకునములే’ టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
 
మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ రోజు ‘అన్నీ మంచి శకునములే’ టైటిల్ ట్రాక్ లాంచింగ్ ఈవెంట్ ని ఉగాది పండగ వాతావరణంలో గ్రాండ్ గా నిర్వహించింది చిత్ర యూనిట్. టైటిల్ ట్రాక్  హార్ట్ వార్మింగ్ కంపోజిషన్, మెస్మరైజింగ్ వాయిస్, అర్థవంతమైన సాహిత్యంతో ప్లజంట్ వైబ్ ను అందిస్తుంది. ఈ పాటని కార్తీక్ పాడగా ..  రెహమాన్ సాహిత్యం అద్భుతంగా వుంది. విజువల్స్ డబుల్ ఇంపాక్ట్ ఇచ్చాయి. 
 
నిర్మాత అశ్వినీదత్ తో పాటు డైరెక్టర్ బివి నందిని రెడ్డి, సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్,  నరేష్, గౌతమి, వాసుకి.. తదితరులు సాంగ్ లాంచింగ్ ఈవెంట్ కు హాజరయ్యారు . ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
 
నందిని గారు. అన్నీ మంచి శకునములే’ సబ్జెక్ట్ ఏమిటి ?
 రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. వేసవిలో మన అమ్మమ్మ ఇంటికి వెళితే ఎంత హాయిగా వుంటుందో లాంటి కథ ఇది. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్ లో కథ కుదరడం అదృష్టం అనుకోవాలి. కాస్టింగ్ వెనుక స్వప్న, ప్రియాంక, దత్ గారి ప్రోత్సాహం ఎంతో వుంది. అన్ని పాత్రలకు వందకు వంద మార్కులు ఇచ్చేస్తారు. 
 
అశ్వినీ దత్ గారు.. మీరు భారీ చిత్రాల నిర్మాత.. ఈ సమయంలో ‘అన్నీ మంచి శకునములే’ లాంటి సినిమా చేయడానికి కారణం ?
అన్నీ మంచి శకునములే’ టైటిల్ నాకే సరిగ్గా వర్తిస్తుంది. స్వప్న సినిమా బ్యానర్ పై మొదటి సినిమాగా స్టూడెంట్ నెం 1 చేశాను. కొంత గ్యాప్ తర్వాత స్వప్న ప్రియాంక అమెరిక నుంచి వచ్చారు. వాళ్లకి ఈ బ్యానర్ బాధ్యతలు ఇచ్చాను. అప్పుడే నా మంచి శకునము స్టార్ అయ్యింది. మంచి కథ , సంగీతం తో ఒక సినిమా చూస్తుంటే ఆ హాయి ఆనందం వేరు.  అంత హాయిగా సాగే  సినిమా ‘అన్నీ మంచి శకునములే’. గౌతమి , వాసుకి చాలా రోజుల తర్వాత ఈ  చిత్రంలో నటిస్తున్నారు. నందిని రెడ్డి అద్భుతంగా ఈ చిత్రాన్ని తీసింది. రాజేంద్ర ప్రసాద్, నరేష్ చక్కని పాత్రలు పోషించారు. మేము పరిచయం చేసిన మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్. సంతోష్ శోభన్ మంచి నడవడిక కలిగిన నటుడు. తప్పకుండా పెద్ద స్టార్ అవుతాడు. తనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.
 
రాజేంద్ర ప్రసాద్ గారు.. నరేష్  గారితో కలసి ఈ పాత్రని చేయడం ఎలా అనిపించింది ?
ఈ కథకు మేమిద్దరం కావాలి. రెండు కుటుంబాల మధ్య అద్భుతమైన కథ. నరేష్ నా తమ్ముడు లాంటి వాడు. తనతో కలసి నటించడం మంచి అనుభూతి.
 
నరేష్ గారు.. రాజేంద్ర ప్రసాద్ గారితో కలసి పని చేయడం ఎలా అనిపించిది ?
నేను దర్శకుల నటుడిని. నేను క్యారెక్టర్ బట్టి వెళ్తాను. రాజేంద్ర ప్రసాద్ తో కలసి చాలా అద్భుతమైన సినిమా చేశాననే తృప్తి వుంది. మా అమ్మగారు విజయనిర్మల గారి తర్వాత నాకు నచ్చిన మహిళా దర్శకురాలు నందిని రెడ్డి.
 
సంతోష్ శోభన్ గారు.. అశ్వినీ దత్, స్వప్న గారి నిర్మాణంలో పని చేయడం ఎలా అనిపించింది ? చాలా ఆనందంగా వుంది. ఈ రోజు ఒక లోటు తీరిపోయింది. నందిని రెడ్డి గారితో పని చేయడం, స్వప్న అక్క సినిమాలో వుండటం చాలా ఆనందాన్ని ఇచ్చాయి. ఇక నుంచి అన్నీ మంచి శకునములే.
 
గౌతమి గారు, వాసుకి గారు.. చాలా రోజుల తర్వాత ఈ సినిమా చేయడం ఎలా నిపించింది ?
 
గౌతమి : కథ వినగానే ఈ సినిమా చేస్తానని చెప్పాను. అంత గొప్పగా నచ్చింది. ఇది వండర్ పుల్ జర్నీ.
 
వాసుకి : నేను స్వప్న మంచి ఫ్రండ్స్. ఈ పాత్ర , కథ నాకు చాలా నచ్చింది. సినిమా చేయడానికి సమయం కుదిరింది.
 
మాళవిక గారు ... సంతోష్ , నందిని రెడ్డి.. టీం తో కలిసి పని చేయడం ఎలా అనిపించింది ?
స్వప్న గారు ప్రియాంక గారు ఈ సినిమాలో నన్ను ఎంపిక చేయడం గొప్ప ఆనందం. ఇంత మంది అనుభవజ్ఞులైన నటీనటులతో కలసి పని చేయడం మంచి అనుభవం.
 
 మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దావూద్ స్క్రీన్ ప్లే అందించగా, లక్ష్మీ భూపాల మాటలు అందించారు. దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.