గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (09:21 IST)

అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్‌తో విమానం తెరకెక్కింది: కె.రాఘ‌వేంద్ర‌రావు

Vimanam with  K. Raghavendra Rao
Vimanam with K. Raghavendra Rao
‘‘చిన్న‌ప్పుడు పిల్ల‌ల్లో ఓ మంచి ఎమోష‌న్‌ను నింపితే వాళ్లు పెద్దై ఏదైనా సాధించ‌గ‌ల‌రు అని చెప్ప‌టానికి ‘విమానం’ సినిమా ఒక ఉదాహ‌ర‌ణ‌’’ అని అన్నారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. తండ్రీ కొడుకులు మ‌ధ్య భావోద్వేగం, లవ్ వంటి ఎమోష‌న్స్ కల‌యిక‌గా రూపొందిన చిత్రం ‘విమానం’. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్‌గా ప్ర‌ముఖ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చేతుల మీదుగా విడుద‌లైన మూవీ ట్రైల‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. 
 
జూన్ 9న తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ అవుతున్న ‘విమానం’ మూవీ ట్రైల‌ర్‌ను వీక్షించిన సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కె.రాఘవేంద్ర‌రావు మాట్లాడుతూ ... ‘‘విమానం’ సినిమా ట్రైల‌ర్ చూశాను. ట్రైల‌ర్ చాలా బాగా వ‌చ్చింది. చాలా మంచి ఎమోష‌న్స్‌తో సినిమా ఉంటుంద‌ని తెలిసింది. అలాగే ద‌ర్శ‌కుడు శివ ప్ర‌సాద్ తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉండే ఎమోష‌న్ గురించి చెబుతుంటే బాగా ట‌చింగ్‌గా అనిపించింది. క‌ళ్ల‌లో నీళ్లు వ‌చ్చాయి. ఇలాంటి డిఫ‌రెంట్ కంటెంట్ సినిమాల‌ను ప్రొడ్యూస‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ ఎంక‌రేజ్ చేయాలి. త‌ల్లిదండ్రులు ‘విమానం’ సినిమాను చూడటమే కాకుండా.. వాళ్ల పిల్లలకు కూడా సినిమాను చూపించాలి. అప్పుడే ఇందులో పిల్లల కోసం తల్లిదండ్రులు పడే తపన ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. అలాగే సినిమాలో మిగిలిన క్యారెక్టర్స్ ఎంతో అద్భుతంగా పండాయి. ఇలాంటి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న ద‌ర్శ‌కుడు శివ ప్ర‌సాద్‌, నిర్మాత కిర‌ణ్ గారికి అభినంద‌న‌లు. ఎంటైర్ టీమ్‌కు కంగ్రాట్స్‌. జీ స్టూడియోస్‌కు ఆల్ ది బెస్ట్‌. ఇలాంటి మంచి సినిమాల‌ను రూపొందిస్తోన్న జీ స్టూడియోస్ ప్రసాద్‌ని ఈ సంద‌ర్బంగా అభినందిస్తున్నాను.
 
అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే ఎమోష‌న‌ల్ పాయింట్‌తో ‘విమానం’ సినిమాను తెరకెక్కించారు. ఈ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత నాకొక విష‌యం గుర్తుకు వ‌చ్చింది. అదేంటంటే ‘జీఎంఆర్ సంస్థ‌ల అధినేత మ‌ల్లిఖార్జున‌రావుగారికి పెళ్లైంది. ఆయ‌న ద‌గ్గ‌ర ఓ వెస్పా ఉండేది. వాళ్లావిడ ఓసారి విమానాన్ని చూపించ‌మ‌ని అడిగితే ఆమెను ఆయ‌న త‌న వెస్పాలో ఆమెను రాజం నుంచి వైజాగ్ తీసుకెళ్లారు.  గోడ మీద నుంచి దూరంగా ఉన్న విమానాన్ని చూపించారు. అలాంటి జీఏంఆర్‌గారు ఇవాళ గొప్ప గొప్ప ఎయిర్ పోర్ట్స్ క‌ట్టారు’. అలా చాలా మంది జీవితాల్లో ఇలాంటి ఎమోషనల్ పాయింట్ ఉంటుంది. దాన్ని ఈ సినిమాలో హార్ట్ టచింగ్‌గా చూపించారు.  స‌ముద్ర‌ఖ‌ని, అన‌సూయ‌, ధ‌న‌రాజ్, రాహుల్ రామ‌కృష్ణ స‌హా అంద‌రూ గొప్ప‌గా పెర్ఫామ్ చేశారు. మ్యూజిక్‌,  బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్‌’’ అన్నారు.