ఛలో పరిగెత్తు ఛలో పరిగెత్తు అంటోన్న రానా.. వీడియో వైరల్
హీరో రానా దగ్గుబాటి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'విరాటపర్వం'లో క్రామేడ్ రవన్నకు సంబంధించిన 'ది వాయిస్ ఆఫ్ రవన్న' అంటూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. 1990వ దశకంలో ఉత్తర తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ విరాటపర్వం సినిమాలో డా. రవి శంకర్ అలియాస్ నక్సలైట్ నాయకుడు కామ్రేడ్ రవన్నగా రానా తన విశ్వరూపాన్ని మరోసారి ప్రదర్శించనున్నాడని తాజాగా విడుదల చేసిన వీడియో చూస్తే అర్ధం అవుతుంది.
ఛలో పరిగెత్తు ఛలో పరిగెత్తు అంటూ విప్లవంతో కూడిన ఒక నిమిషం వీడియో సినిమా మీద అంచనాలను అంతకంతకూ పెంచేస్తోంది.