గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (16:37 IST)

త‌న పెండ్లికి అడ్డుకుంటున్న ఆడవాళ్లు మీకు జోహార్లు అంటున్న శ‌ర్వానంద్‌

Sharwanand, Rashmika
తన పెళ్లి కాకపోవడానికి ఆడాళ్ళే కారణమంటూ నిందిస్తున్నట్టు వుండే టైటిల్ సాంగ్‌ను ఈరోజు విడుద‌ల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఆడవాళ్లు మీకు జోహార్లు.. అంటూ సాగే టైటిల్ సాంగ్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. తన జీవితం అలా కావాడానికి కారణమైన ఆడవాళ్ల అందరి మీదున్న ఫ్రస్ట్రేషన్‌ను హీరో ఈ పాటలో చూపించారు. తన పెళ్లి కాకపోవడానికి కూడా వారే కారణమంటూ నిందిస్తున్నట్టు కనిపిస్తోంది. శ్రీమణి రాసిన సాహిత్యం, దేవీ శ్రీ ప్రసాద్ గానం చక్కగా కుదిరింది.
 
శర్వానంద్, రష్మిక న‌టించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
 
కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు.  సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు
 
సాంకేతిక బృందం-  దర్శకత్వం: తిరుమల కిషోర్, నిర్మాత : సుధాకర్ చెరుకూరి, బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్,  సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్, సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ,  కొరియోగ్రఫర్: దినేష్