శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:55 IST)

భీష్ముడిగా బాలకృష్ణ గెట‌ప్ ఇదే!

Bheshama, Balakrishna
నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ ఎన్ టీ ఆర్ కధానాయకుడు చిత్రంలో తాను భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.."భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న గారు, ఆయన వయసుకి మించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు. ఆ చిత్రం, అందులోని నాన్నగారు నటించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం. అందుకనే `ఎన్ టీ ఆర్ కధానాయకుడు` చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాము. అందులో నేను భీష్మునిగా నటించాను.  అయితే నిడివి ఎక్కువ అవడం వలన ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన ఫోటోలను ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాను."  అన్నారు.