శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (19:18 IST)

ఇది చాలా.. ఇంకా కావాలా? రాశీఖన్నా జిమ్ సెంటర్లో...

ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
రాశీ ఖన్నా. కరోనా లాక్ డౌన్లో కూడా తన ఫోటోషూట్లతో మత్తెక్కించిన టాలీవుడ్ సెక్సీ తార. బొద్దుగా వుంటే ఎలాగమ్మా అని ఏ దర్శకనిర్మాతో అన్నారట. అంతే పట్టుబట్టి జిమ్ సెంటర్లో తిష్ట వేసిందట. కండలన్నింటిని కరిగించేసి అందులో నుంచి గ్లామర్ డోస్ ఎగసిపడేట్లు చేసేసిందట.
ఇక ఇప్పుడు తన గ్లామర్ ఫిజిక్ చూడండంటూ తన ఇన్‌స్టాలో ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలను టాలీవుడ్ దర్శకనిర్మాతలు చూసారో లేదో కానీ కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం గుడ్లప్పగించి అలానే చూసేస్తూ ఇవిగో రాశీ ఆఫర్లు అని పిలిచి మరీ ఇస్తున్నారట.
ఐతే టాలీవుడ్ ఇండస్ట్రీనే నమ్ముకున్న రాశీఖన్నాకు ఇక్కడి స్టార్ హీరోలతో ఛాన్సులు ఏమయినా వస్తాయేమో చూడాలి. అన్నట్లు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుండే హీరోలు ఈసరికే చూసే వుంటారులే. రాశీకి ఛాన్స్ ఇవ్వాలంటే కరెక్ట్ రోల్ కుదరాలి కదా. మరి అప్పటిదాకా రాశీఖన్నా జిమ్ సెంటర్లో అలా తిప్పలు పడుతూనే వుంటుంది కాబోలు.