Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

‌'అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని'... ఇదీ హీరోయిన్ రెజీనా పరిస్థితి...

శనివారం, 20 మే 2017 (11:56 IST)

Widgets Magazine
regina

‌'అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని' ఇదీ టాలీవుడ్ హీరోయిన్ పరిస్థితి రెజీనా. అందం చందం ఉన్న రెజీనాకు ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టు ఉండిపోయింది. ‌ఫ్లాపుల కన్నా సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్నా స్టార్‌ హీరోలతో చేసే ఛాన్స్‌ మాత్రం అందుకోలేకపోయింది. అవడానికి తమిళ అమ్మాయే అయినా ఇంతవరకూ తమిళ తంబిల మనసు దోచుకోలేకపోయింది. చిట్టచివరకు తన మాతృభాషలో బిజీ అవుతున్న రెజీనాతో.
 
ఆమె ఓ పత్రికకు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఇక్కడ ఎప్పుడో బిజీ కావలసింది. భగవంతుడు నా కెరీర్‌ను మరోలా డిసైడ్‌ చేశాడు. అందుకే ఇక్కడ రావలసినంత పేరు రాలేదు. తమిళ అమ్మాయినే అయినా తమిళ సినిమాలు చేయడం లేదన్న బాధ ఎక్కడో ఓ మూల ఉండేది. ఇప్పుడు అది తీరిపోయింది. ప్రస్తుతం తమిళంలో వరుసగా ఐదు సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నవన్నీ నాకు పేరు తీసుకొచ్చేవే! త్వరలోనే కోలీవుడ్‌లో మంచి స్థాయికి చేరుకుంటానన్న నమ్మకం నాకుంది. 
 
సినిమా ఒప్పుకునే ముందు కథ ఏమిటి‌? అందులో నా పాత్ర ఏమిటి? అని చూస్తాను తప్ప చిన్న హీరోనా? పెద్ద హీరోనా? బ్యానర్‌ ఎలాంటిదిలాంటి విషయం పట్టించుకోను. నా సినిమాలు పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. సినిమాల ఎంపికలో నా జడ్జిమెంట్‌ చాలా వరకూ కరెక్ట్‌గానే ఉంటుంది. అందుకే నా మీద ఫ్లాప్‌ హీరోయిన్‌ ముద్ర పడలేదు. ఇక పెద్ద హీరోలతోనే చేస్తేనే గుర్తింపు వస్తుంది అంటే నేను నమ్మను. దక్షి‍ణాదిన నాకు మంచి గుర్తింపే వచ్చింది. మంచి కథతో వస్తే ఎవరితో చేయడానికి అయినా నేను రెడీ. 
 
ఎవరినీ ఆదర్శంగా తీసుకోవలసిన అవసరం లేదు. నాకు షూటింగ్‌ లేకపోతే ఖచ్చితంగా సినిమా ప్రమోషన్లకు వస్తాను. షూటింగ్‌ ఉన్నప్పుడు రమ్మంటే ఎలా రాగలను? అదే విషయం చెబితే రెజీనాకు పొగరు. ప్రమోషన్లకు రమ్మంటే రాదు అంటారు. అసలు నేను చేసిన సినిమాల ప్రమోషన్లకు దాదాపు అన్నిటికీ నేను అటెండ్‌ అవుతూనే ఉంటాను. ఎప్పుడన్నా ఒక్క సినిమాకు వెళ్ళకపోయేసరికి ఇలాంటి మాటలు అనేస్తుంటారు అని వాపోతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో మరో మూవీ...

ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మాత‌గా మారారు. యువ‌సుధ ఆర్ట్స్ ...

news

శ్వేత గ్లామర్‌తో 'మిక్చర్‌ పొట్లం'.. మిక్చర్‌లో అన్ని ఉన్నట్లే కథలో కూడా..

హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్‌ వ్యక్తిగత వివాదంలో నుంచి బయటపడి సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను ...

news

విజయానికి సంబంధించిన ఎల్లల్ని ఛేదించి పారేసిన బాహుబలి-2.. మరో 30 ఏళ్లు చెదరని రికార్డు సొంతం

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సాగిస్తున్న సంచలనాత్మక విజయం కానీ, చైనాలో దంగల్ సృష్టిస్తున్న ...

news

బాహుబలి సీక్వెల్స్ వసూళ్లు రూ. 2,200 కోట్లా.. బాలీవుడ్ హీరోలం సిగ్గుపడాలి అంటున్న హృతిక్ రోషన్

బాహుబలి 1, బాహుబలి 2 కలిసి ఇప్పటికే 2,200 కోట్లపైగా కలెక్షన్ల పంట పడించాయి. ఇది ...