సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జులై 2018 (14:08 IST)

నేను తెలుగమ్మాయిని అలాంటి పాత్రలు చేయను... (Video)

'క్షణం' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గూఢచారి'. ఇందులో తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ళ అనే యువతి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు మూడో తేదీన ప్రేక్షకుల ముందు

'క్షణం' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గూఢచారి'. ఇందులో తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ళ అనే యువతి హీరోయిన్‌గా నటిస్తోంది.


ఈ చిత్రం ఆగస్టు మూడో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా శోభిత మాట్లాడుతూ, తాను అచ్చం తెలుగు అమ్మాయినని, అందాలు ఆరబోసే పాత్రలు చేయబోనని తేల్చి చెప్పింది.

అదేసమయంలో మిస్‌ ఇండియా కిరీటం గెలిచిన తర్వాత నాకు చాలా కాల్స్‌ వచ్చాయి. మా సినిమాల్లో నటించండి అంటూ చాలా మంది అడ్వాన్స్‌లు ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ నాకు అప్పుడు నటించే ఉద్దేశ్యం లేదు. ఇప్పుడు మాత్రం నటిని కావాలని బలమైన నిర్ణయం తీసుకున్నాను అని తెలిపింది. 
 
ఇకపోతే, 'గూఢచారి' చిత్రం గురించి స్పందిస్తూ, ఈ సినిమా భావోద్వేగం నిండిన సినిమా. ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నందుకు చాలా రావడం సంతోషంగా ఉంది. నేను ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా.. ఎప్పటికీ తెలుగు అమ్మాయినే. ఒకప్పుడు నాకు టాలీవుడ్‌, బాలీవుడ్ అనే తేడాలు ఉండేవి. ఇప్పుడు అస్సలు అలాంటివేమీ లేవని తెలిపింది. 
 
ఎందుకంటే.. నేను ఎనిమిదేళ్ల క్రితం ముంబైకు వెళ్లా. అక్కడ కొన్ని సినిమాలు చేశా. ఇప్పుడు ఈ సినిమా చేసిన తర్వాత నాకు భాషల మధ్య తేడా ఉందని అనిపించలేదు. అంతా ఒక్కటే అన్న భావన కలిగింది. ఏదో సినిమాలో అలా కనిపించామా? వెళ్లిపోయామా? అనే పాత్రలు చేయాలని లేదు. గుర్తింపు లభించే పాత్రలను మాత్రమే చేయాలి అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది.