ఆస్పత్రిపాలయ్యా.. మీ ఆశీస్సులు కావాలంటూ కమెడియన్ పృథ్వీ-Video

Prithvi
పృధ్వీ
ఠాగూర్| Last Updated: మంగళవారం, 4 ఆగస్టు 2020 (21:34 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన కమెడియన్, ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీరాజ్ అలియాస్ థర్టీ ఇయర్ ఇండస్ట్రీ ఆస్పత్రి పాలయ్యారు. ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో వైద్యుల సూచన మేరకు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ మీ ఆశీస్సులు కావాలంటూ ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.

తాను గత కొన్నిరోజులుగా తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని, పలుచోట్ల వైద్య పరీక్షలు చేయిచేస్తే కరోనా నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు. సీటీ స్కానింగ్ కూడా తీయించానని, అయితే డాక్టర్ల సూచన మేరకు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకుని, సోమవారం అర్థరాత్రి ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు.
prithvi

ప్రస్తుతం అభిమానుల ఆశీర్వాదాలతో పాటు వెంకటేశ్వరస్వామి దీవెనలు తనకుండాలని కోరుకుంటున్నానని, త్వరలోనే ఆరోగ్యవంతుడ్ని కావాలని కోరుకుంటున్నానని పృథ్వీ తన వీడియోలో తెలిపారు.

కాగా, ఏపీ ప్రభుత్వం ఆయన్ను ఎస్వీబీసీ టీవీ చానెల్ ఛైర్మన్‌గా నియమించింది. ఆ తర్వాత ఆ చానెల్‌లో పని చేసే ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించినట్టు ఓ వీడియో లీక్ అయింది. దీనిపై పెద్ద దుమారం చెలరేగడంతో ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించింది. అదేసమయంలో ఆయనకు టాలీవుడ్‌లో సరైన అవకాశాలు లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యాడు.దీనిపై మరింత చదవండి :