'అతిలోకసుందరి' మృతిపై దర్శకేంద్రుడు ఏమన్నారంటే...
పదహారేళ్ల వయసు నుంచి అతిలోకసుందరి వరకు.. తెలుగు తమిళ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు.. శ్రీదేవి అధిరోహించని మైలురాయి లేదంటే అతిశయోక్తి కాదు.. బాలనటి నుంచి మహానటి వరకు నాతో ప్రయాణం చేసిన శ్రీదేవి హఠ
పదహారేళ్ల వయసు నుంచి అతిలోకసుందరి వరకు.. తెలుగు తమిళ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు.. శ్రీదేవి అధిరోహించని మైలురాయి లేదంటే అతిశయోక్తి కాదు.. బాలనటి నుంచి మహానటి వరకు నాతో ప్రయాణం చేసిన శ్రీదేవి హఠాన్మరణం అత్యంత బాధాకరం. భారతీయ చిత్రపరిశ్రమకు ఇది తీరని లోటు. ఎక్కడున్నా తన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.. అంటూ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ట్విట్టర్లో శ్రీదేవి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
ఇదేవిధంగా శ్రీదేవి మృతి పట్ల నటీమణి జయసుధతో పాటు నేటి స్టార్ హీరోయిన్లు శృతిహాసన్, కాజల్ అగర్వాల్, అనుపమ పరమేశ్వరన్‌లు కూడా ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. స్టార్ హీరోలు ఎన్‌టీఅర్, రవితేజ, సీనియర్ నటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌తో పాటు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, కమెడియన్ వెన్నెల కిశోర్.. యువహీరోలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.