గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (14:15 IST)

సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పిన కొరటాల శివ.. ఎందుకు?

తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఈయన తీసిన ప్రతి చిత్రం సూపర్ హిట్టే. పైగా సందేశాత్మకంగా సమాజానికి ఓ మంచి మెసేజ్‌ను ఇచ్చేలా ఉంటాయి. అలాంటి కొరటాల శివ ఇపుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తాను సోషల్‌ మీడియా నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి అందరికి షాక్‌ ఇచ్చాడు. 
 
ఈ మేరకు ఆయన ‘నా వ్యక్తిగత విషయాలను, నేను తీసే సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా మీతో పంచుకున్నాను. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నా. ఇకపై మీడియా మిత్రుల ద్వారా ప్రతి అప్‌డేట్‌ అందిస్తూ ప్రేక్షకులకు చేరువలోనే ఉంటాను. మీడియా చానళ్లు, పత్రికల ద్వారా మనం కలుస్తూనే ఉంటాం. దీనివల్ల మీడియం మారిందే తప్ప మన మధ్య బంధంలో మార్పు ఉండదు’ అంటూ కొరటాల ట్వీట్‌ చేశాడు.
 
కాగా ప్రస్తుతం కొరటాల మెగాస్టార్‌ చిరంజీవితో "ఆచార్య" మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని అనంతరం జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేసేందుకు సన్నాహలు చేస్తున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబు లేదా రామ్ చరణ్‌తో మరో సినిమా ఉండొచ్చన్నది ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.