శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (13:39 IST)

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం .. దర్శకుడు శరత్ కన్నుమూత

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ దర్శకుడు శరత్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయన శుక్రవారం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 11 గంటలకు పంజాగుట్టలోని మహాప్రస్థానంలో జరుగనున్నాయి. 
 
కాగా, "చాదస్తపు మొగుడు" మూవీతో తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకుడుగా పరిచయమైన శరత్ దాదాపు 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా, టాలీవుడ్ హీరోలు సుమన్, బాలకృష్ణలతో ఆయన మంచి హిట్ చిత్రాలను నిర్మించారు. బాలయ్యతో "పెద్ద అన్నయ్య", "పెద్దింటి అల్లుడు", "వంశోద్ధారకుడు" వంటి చిత్రాలను నిర్మించారు.