సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (11:12 IST)

టాలీవుడ్ డ్రగ్స్ కేసు : ఈడీ ముందుకు హీరో రానా

తెలుగు చిత్రపరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా బుధవారం ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్) అధికారుల ముందుకు మరో హీరో దగ్గుబాటి రానా వచ్చారు. ఈ కేసు విచారణలో భాగంగా, ఇప్పటికే దర్శకుడు పూరీ జనగ్నాథ్, హీరోయిన్లు ఛార్మి, రకుల్, కెల్విన్‏లను విచారిచిందింది. 
 
దీంతో ఈడీ.. కొందరిలో వేడి పుట్టిస్తోంది. డ్రగ్స్ వాడారన్న ఆరోపణలతో పాటు భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగాయనే అరోపణల మధ్య ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను ప్రశ్నలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇప్పుడు మరో బిగ్ హీరో వంతు వచ్చింది. బుధవారం భల్లాలదేవపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు ఈడీ సిద్ధమైంది.
 
ఇందుకోసం ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రానా బ్యాంకు ఖాతాల వివరాలు ఇప్పటికే సేకరించినట్టుగా తెలుస్తోంది. అందులోని లావాదేవీలు, ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులోని ఇతరులతో ఉన్న సంబంధాలపైనా రానాను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అలాగే, హీరోయిన్ ముమైత్ ఖాన్‌ను కూడా బుధవారమే విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2017లో ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులో రానా, రకుల్ పేర్లు లేవు. కానీ ఇప్పుడు ఈ కేసులో వీళ్లిద్దరికి ఈడీ సమన్లు పంపడం చర్చనీయాంశమైంది.