బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 మార్చి 2022 (09:32 IST)

టాలీవుడ్‌లో విషాదం : ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ ఈశ్వర్ రావు అలియాస్ ఈశ్వర్ కన్నుమూశారు. ఈయన వయసు 63 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఈయన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నైలోని తుదిశ్వాస విడిచారు. ఈయన దిగ్గజ దర్శకుడు ఎస్పీ కోదండపాణి కుమారుడు కావడం గమనార్హం. 
 
ఈయన తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాలకు సంగీతం అందించారు. ముఖ్యంగా, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాలకు ఆయన సంగీత సహకారం అందించారు. వీటితో పాటు.. అంతఃపురం, శుభలేఖ, జీవితం వంటి అనేక టీవీ సీరియళ్ళకు సంగీత దర్శకుడుగా పని చేశారు. 
 
ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈశ్వర్ రావు మరణంతో తెమిళం, తెలుగు సినీ పరిశ్రమలలో విషాదచాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఈశ్వర్ మృతిపట్ల తమ సంతాపాలు తెలుపుతున్నారు.