గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2022 (19:51 IST)

‌అమర్​దీప్‌కు తేజస్వినితో నిశ్చితార్థం.. ఫీమేల్ ఫ్యాన్స్‌కు షాక్

Jaanaki Kalaganalu
Jaanaki Kalaganalu
జానకి కలగనలేదు సీరియల్‌తో తెలుగు నాట మంచి పేరు తెచ్చుకున్న అమర్​దీప్ తన ఫీమేల్ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చాడు. కేరాఫ్​ అనసూయ ధారావాహిక నటి తేజస్విని పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. రీసెంట్‌గా వీరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. ఈ వేడుకకు నటి, యాంకర్ అరియానా హాజరైంది.
 
ఈ కాబోయే జంటకు విషెస్ తెలుపుతూ వారితో కలిసి దిగిన ఫోటోను స్మాల్ వీడియోగా చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన అమర్​దీప్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు.
 
'ఇంత సడెన్ షాక్ ఇచ్చావ్.. మా మనసులను గాయపరిచావ్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్న ఈ కపుల్‌కు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. కాగా వీరిది లవ్ మ్యారేజ్ అని తెలుస్తోంది.