మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (13:52 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల పంచాయతి కొలిక్కి వచ్చేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల పంచాయతీ పెండింగ్‌లో ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర హైకోర్టు ఆదేశం మేరకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని టిక్కెట్ల ధరలు కేటాయించాల్సివుంది. 
 
ఈ నేపథ్యంలో సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం నియమించిన 13 మంది సభ్యుల కమిటీ మరోమారు సమావేశంకానుంది. ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన ఈ కమిటీ మూడోసారి కూడా భేటీ అవుతుంది. ఈ సమావేశంతో టిక్కెట్ల ధరలపై ఓ సముచిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. 
 
ప్రధానంగా బి, సి సెంటర్లలో రెండు వారాల పాటు సినిమా టిక్కెట్ల ధరలను పెంచుకునేలా ఈ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు, ఈ నెలలో వరుసగా పెద్ద చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో ఈ సినిమా టిక్కెట్ల పంచాయతీ కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.