శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2015 (14:03 IST)

శ్రుతిహాసన్: టాలీవుడ్-కోలీవుడ్‌కు ఓ రేటు.. బాలీవుడ్‌ అంటే వేరే రేటు..!

శ్రుతిహాసన్ కమల్ హాసన్ కుమార్తె. స్మార్ట్ గర్ల్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ.. విభిన్న ఇండస్ట్రీల్లో వివిధ భాషల్లో నటిస్తోంది. తెలుగు, తమిళంతో పాటు దక్షిణాదిన టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన శ్రుతిహాసన్.. కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో పారితోషికాన్ని రూ.1.5 కోట్లు పుచ్చుకుంటోంది. అదే బాలీవుడ్ అయితే ఈ రేటు కాస్త తగ్గింది. బాలీవుడ్‌లో రోల్‌ను బట్టి శ్రుతిహాసన్ డబ్బు తీసుకుంటోంది. 
 
దక్షిణాదిన హీరోయిన్‌గా ఓ రేంజ్‌‍లో ఉన్న శ్రుతిహాసన్.. బాలీవుడ్‌లో కాస్త తగ్గింది. మంచి అవకాశం కోసం వేచి చూస్తున్న శ్రుతిహాసన్ బిటౌన్‌లో మాత్రం రూ.కోటిని పారితోషికంగా తీసుకుంటోంది. దక్షిణాదిన టాప్ హీరోయిన్ తరహాలో రాణించాలని అనుకున్నప్పటికీ.. బిటౌన్లో తలదన్నే హీరోయిన్స్ ఉండటం శ్రుతిహాసన్ పారితోషికం తక్కువగా తీసుకునేందుకు కారణమవుతోందని సినీ పండితులు అంటున్నారు.