గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (08:04 IST)

విషమంగానే కత్తి మహేష్ ఆరోగ్యం.. నేడు నేత్ర చికిత్స

రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లా రామచంద్రాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్‍‌పై చికిత్స పొందుతున్నారు. 
 
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేశ్‌ను తొలుత నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కానీ, వైద్యులు సూచన మేరకు.. శనివారం రాత్రి చెన్నై తీసుకొచ్చారు. ప్రమాదంలో దెబ్బతిన్న మహేశ్‌ రెండు కళ్లకు సోమవారం శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. 
 
ఎడమ కన్ను చూపు పూర్తిగా పోయిందని వైద్యులు అంటున్నారని ఆయన మేనమామ ఎం.శ్రీరాములు చెప్పారు. ప్రమాదం వల్ల మెదడులో ఎలాంటి రక్తస్రావం జరగలేదని, అందువల్ల మహేశ్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని, ఇది కాస్త ఊరటకలిగించే విషయమన్నారు.