సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (16:43 IST)

నాకు కాబోయే భర్త మంచి వాడై వుంటే చాలు... త్రిప్తి డిమ్రీ

image
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన రణబీర్ కపూర్, రష్మిక మందన్న నటించిన ‘యానిమల్’ చిత్రంలో త్రిప్తి దిమ్రీ చిన్న పాత్రలో కనిపించి..  సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. యానిమల్ విడుదల తర్వాత ఆమె భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. అభిమానులు ఆమె గురించిన వ్యక్తిగత జీవితం గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. ఇంకా తాజాగా త్రిప్తి డిమ్రీ పెళ్లిపై స్పందించింది.  
 
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, త్రిప్తి డిమ్రీని పెళ్లి చేసుకోవడం గురించి అడిగారు. దానికి ఆమె తన పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని, ఆమె తన కెరీర్‌ను నిర్మించడంపై మాత్రమే దృష్టి సారిస్తోందని సమాధానం ఇచ్చింది. తన భర్త గురించి, అతని నుండి ఆమెకు ఏమి కావాలి అని అడిగినప్పుడు, అతను మంచి మనిషిగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నానని చెప్పింది. 
 
ఇటీవల ఆమె తన పుట్టినరోజు సందర్భంగా హోటలియర్, స్నేహితుడు సామ్ మర్చంట్‌తో కలిసి త్రోబాక్ చిత్రాన్ని పంచుకుంది. దీంతో ఆమె సామ్ మర్చంట్ తో ప్రేమలో వున్నట్లు అందరూ భావించారు. కానీ ఈ పుకార్లను ఆమె తోసిపుచ్చింది.