శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (10:05 IST)

పెళ్ళిమాటెత్తొద్దు.. నన్ను ఉడికించొద్దు.. ట్విట్టర్లో త్రిష సమాధానం

కోలీవుడ్‌ సుందరి త్రిష ప్రస్తుతం సినీ షూటింగ్‌లలో బిజీ బిజీగా గడుపుతోంది. కోలీవుడ్‌లో విజయ్‌, అజిత్‌ వంటి అగ్ర హీరోల సరసన నటిస్తూనే.. రానాతో త్రిష లవ్వాయణం సాగించింది. రానాతో త్రిష పెళ్లి కూడా జరుగనుం

కోలీవుడ్‌ సుందరి త్రిష ప్రస్తుతం సినీ షూటింగ్‌లలో బిజీ బిజీగా గడుపుతోంది. కోలీవుడ్‌లో విజయ్‌, అజిత్‌ వంటి అగ్ర హీరోల సరసన నటిస్తూనే.. రానాతో త్రిష లవ్వాయణం సాగించింది. రానాతో త్రిష పెళ్లి కూడా జరుగనుందని అప్పట్లో టాక్ వచ్చింది. కానీ అమ్మడు వాటికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ నిర్మాత వరుణ్‌ మణియన్‌ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. వెంటనే వారిద్దరికి వివాహ నిశ్చితార్ధం కూడా జరిగింది. 
 
అయితే వివాహం తర్వాత సినిమాల్లో నటించకూడదని వరుణ్‌ కుటుంబీకులు ఆంక్షలు విధించడంతో అమ్మడు పెళ్లికి పెడమొహం పెట్టింది. దీంతో త్రిష, వరుణ్‌ల పెళ్లి పీటలెక్కలేదు. దీంతో పెళ్లికి దూరమైన త్రిష.. ఆపై సినీ అవకాశాలతో బిజీగా ఉంటోంది. ఇక ఎవరైనా త్రిష వద్ద పెళ్లెప్పుడని అడిగితే చాలు వారిపై అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతోందట. అప్పటి నుంచి వారితో మాట్లాడటం తగ్గించుకుంటోందట. 
 
ఇటీవల ట్విట్టర్‌లో అభిమానులతో త్రిష చాటింగ్‌ చేస్తుండగా ఒక అభిమాని పెళ్లి ఎప్పుడని అడిగాడట. ఆ మాట ఎత్తి తనను ఉడికించవద్దని హెచ్చరించిందట. ఇప్పుడు ఈ వార్త అభిమానుల్లో హల్‌చల్‌ చేస్తోంది.