సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (17:14 IST)

వివాహ వ్యవస్థపై నమ్మకం లేదు.. కానీ పెళ్లంటూ జరిగితే?: త్రిష (video)

పెళ్లిపై చెన్నై చంద్రం త్రిష ఆసక్తికర కామెంట్స్ చేసింది. వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని త్రిష సంచలన వ్యాఖ్యలు చేసింది. కానీ తనకు నచ్చిన మగాడు దొరికి.. పెళ్లంటూ చేసుకుంటే.. వెగాస్‌లోనే చేసుకుంటానని.. అదే తన డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్, మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా, మోహల్ లాల్‌తో రామ్ సినిమాలతో త్రిష బిజీబిజీగా వుంది. 
 
వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, కృష్ణ, స్టాలిన్, నమో వేంకటేశ.. పలు సూపర్ డూపర్ సినిమాల్లో నటించిన త్రిష.. కొన్నేళ్ల పాటు తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఉంది. అయితే దక్షిణాదిన తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళ సినిమాలు చేస్తూ.. ఇతర భాషల్లోనూ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.