గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (12:42 IST)

సీఎం కేసీఆర్ చిత్రపరిశ్రమ పక్షపాతి : తెలంగాణ మంత్రి అలీ

తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు తెలుగు చిత్రపరిశ్రమ పక్షపాతి అని ఆ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆయన బుధవారం "సదా నన్ను నడిపే" అనే టీజర్‌ను రిలీజ్ చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "చిత్రపరిశ్రమకు హైదరాబాద్ నగరం ఎంతో అనుకూలంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. తమ ప్రభుత్వం సినీ పరిశ్రమకు పూర్తి అండగా ఉంది. 
 
వచ్చే ఐదేళ్ళలో చిత్ర నిర్మాణంలో హైదరాబాద్ నగరం దేశానికి మరో ముంబై మహాననగరంలా మారుతుంది. చిత్రపరిశ్రమకు సీఎం కేసీఆర్ చిత్రపరిశ్రమ పక్షపాతి. అన్ని విధాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు" అంటూ వ్యాఖ్యానించారు.