గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (16:44 IST)

డబ్బుల్లేకపోతే మేకప్ మ్యాన్ ఆదుకున్నాడు.. సోనాల్ భావోద్వేగ ట్వీట్

Sonal Vengurlekar
కరోనా వైరస్ కారణంగా సినీ ప్రముఖులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. బాగా సంపాదించేసిన సెలెబ్రిటీలు ఈ లాక్ డౌన్‌తో పెద్దగా ఇబ్బంది పడట్లేదు కానీ.. చిన్నచితకా కళాకారులు మాత్రం నానా తంటాలు పడుతున్నారు. తాజాగా టీవీ సీరియల్ నటి డబ్బు లేక చాలా ఇబ్బంది పడిందట.

రెండు నెలల లాక్ డౌన్ కారణంగా చేతులో వున్న డబ్బంతా అయిపోయిందని టెలివిజన్ నటి సోనాల్ వెంగర్లేకర్ అంటోంది. తనకు రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన నిర్మాత ఒకరికి కాల్ చేసి డబ్బులడగగా అతను మొహంచాటేశాడని తెలిపింది. 
 
వరుసగా డబ్బు కోసం కాల్ చేస్తుంటే.. తన నెంబర్‌ను బ్లాక్ చేశాడని వాపోయింది. ఇక చేసేది లేక మేకప్ మ్యాన్‌తో తన గోడును చెప్పుకున్నానని.. తన బాధను అర్థం చేసుకున్న పంకజ్ గుప్తా అనే మేకప్ మ్యాన్ డబ్బిచ్చి ఆదుకున్నాడు. ఇంకా తన భార్య గర్భవతిగా ఉన్నా కూడా తన వద్ద ఉన్న డబ్బును ఆమెకు ఇవ్వడానికి ముందుకొచ్చాడట.
 
ఇలా 15వేల రూపాయలను తనకిచ్చాడని.. కానీ భార్య డెలివరీ సమయానికి ఇచ్చేయమన్నాడని తెలిపింది. మేకప్ మ్యాన్ మంచితనాని చూసి కన్నీటి పర్యంతం అయ్యానని సోనాల్ తెలిపింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ను పెట్టింది.