ఆస్పత్రిలో చేరిన లాస్య.. వీడియో వైరల్
టీవీ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ లాస్య ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. లాస్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయాన్ని ఆమె భర్త మంజునాథ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వీడియోను పోస్ట్ చేశాడు.
వీడియోలో హాస్పిటల్ బెడ్పై లాస్య పడుకొని ఉంది. అయితే, ఆమెకు ఏమైందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు, ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.