Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శిశుపాలుడి వధకు వందకారణాలు.. త్రిష పెళ్లాడక పోవడానికి నూటొక్క కారణాలు

హైదరాబాద్, సోమవారం, 12 జూన్ 2017 (08:15 IST)

Widgets Magazine
trisha

మూడు పదులు దాటిన వయస్సులో మన హీరోయిన్లు పెళ్లికి దూరంగా ఉండటానికి కెరీర్ పోగొట్టుకోకూడదన్నదే ప్రధాన కారణం. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లుగా గుర్తింపు పొందిన ప్రభాస్, రానా కూడా బాహబలి చిత్రం పూర్తయిన తర్వాత కూడా పెళ్లిమాట ఎత్తకుండా ఎవరి షూటింగుల్లో వారు ఉన్నారంటే కెరీర్‌పై దృష్టి పెట్టడమే కారణం. ఈ కోవలోనే మన హీరోయిన్లు కూడా నడుస్తుండటం గమనార్హం. 
 
దాదాపు 36 ఏళ్లు నిండిన తాను సైన్ చేసిన చిత్రాలు పూర్తి చేయడం కోసమే ఇంకో రెండేళ్లు పెళ్లి మాటెత్తవద్దని తన తల్లిదండ్రులకు తేల్చి చెప్పిన విషయం తెలసిందే. వృత్తి పట్ల అంకితభావం, ప్రొఫెషనల్ తత్వం లేకపోతే హీరోయిన్లు లేటు వయసులోనూ పెళ్లి చేసుకోకుండా ఉంటారా అన్నది ప్రశ్న. అనుష్కతోపాటు కాజల్, నయనతార, వంటి సీనియర్ నటిలు కూడా ఇదే కోవలో నడుస్తుండటం విశేషం. 
 
శిశుపాలుని వధకు అతడు చేసిన నూరు తప్పులే కారణం అని మహాభారతం చెబుతుంది. పలానా పని చేయకపోవడానికి వంద కారణాలున్నాయని దక్షిణాదిలో నుడికారం ఉంది. అయితే హీరోయన్‌ త్రిష మాత్రం తాను పెళ్లి చేసుకోకపోవడానికి 101 రీజన్స్‌ ఉన్నాయని చెబుతున్నారు. 
 
మూడు పదుల వయసు దాటినా ఈ చెన్నై సుందరి ఇప్పటికీ టాప్‌ హీరోయిన్‌లలో ఒకరిగా ఉంటున్నారు. పెళ్లి కబురు మాత్రం చెప్పడం లేదు. అయితే ఆదివారం ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంలో త్రిష తన పెళ్లి గురించి స్పందించారు. ఓ అభిమాని ‘మీరంటే నాకు చాలా ఇష్టం. కనీసం నేను పెళ్లి చేసుకునేవరకైనా మీరు చేసుకోకండి’ అని రిక్వెస్ట్‌ చేశాడు. 
 
దీనికి త్రిష బదులిస్తూ ‘నేను పెళ్లి చేసుకోకపోవడానికి వంద కారణాలు ఉన్నాయి. నీ రిక్వెస్ట్‌తో ఆ లిస్ట్‌ 101కి చేరింది’ అని బదులిచ్చారు. అంటే.. త్రిష పెళ్లి చేసుకోకపోవడానికి నూటొక్క కారణాలు ఉన్నాయన్నమాట. చూస్తుంటే ఈ చెన్నయ్ చంద్రం కూడా మరో రెండు మూడేళ్లు పెళ్లి మాట ఎత్తకుండానే సినిమాల్లో మునిగేటట్టే ఉంది మరి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వయసు పెరుగుతున్న కొద్ది జోరు పెంచుతోంది.. ఆరు నెలల్లో అరడజను సినిమాలు..!

ఒక సంవత్సరంలో 10కి పైగా సినిమాల్లో నటించి విడుదల చేసిన ఓన్లీ ది గ్రేటెస్ట్ నటుడు ఎవరో ...

news

ప్రభాస్ లేకున్నా సాహో చిత్రం షూటింగ్ షురూ... విలన్‌గా సరిజోడు నీల్ నితిన్

ఒక భారతీయ సినిమాలోని పాటలు, దృశ్యాలు, విజువల్స్‌ని భాష అర్థం కాకున్నా దక్షిణాఫ్రికా నుంచి ...

news

చరిత్రలో నాకూ కొన్ని పేజీలుంటాయన్నమాట.. సంబరపడ్డ ఆ పుష్పలత ఎవరు?

మలయాళీగా పుట్టి తెలుగు కుటుంబంలో మెట్టి తెలుగు టీవీ చానళ్లలో గత రెండు దశాబ్దాలకు పైగా ...

news

ఒక ప్రాణం ఒక త్యాగం తెలిపిందా తన గమ్యం ( వీడియో సాంగ్) వచ్చేసింది...

బాహుబలి ఒక ప్రాణం వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇంతకుముందు రెండు పాటలను విడుదల చేయగా ...

Widgets Magazine