సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కేఆర్కే ట్విట్టర్ ఖాతా నిలిపివేత

బాలీవుడ్‌లో నెం.1 సినీ విమ‌ర్శ‌కుడిగా త‌న‌ను తాను వ‌ర్ణించుకునే క‌మ‌ల్ ఆర్.ఖాన్ ఖాతాను ట్విట్ట‌ర్ నిలిపివేసింది. హిందీ సినిమాలు భార‌త్‌లో విడుద‌ల‌వ‌డానికి ముందే దుబాయ్‌లో ప్రీమియ‌ర్ షో చూసేసి, వెకిలి

బాలీవుడ్‌లో నెం.1 సినీ విమ‌ర్శ‌కుడిగా త‌న‌ను తాను వ‌ర్ణించుకునే క‌మ‌ల్ ఆర్.ఖాన్ ఖాతాను ట్విట్ట‌ర్ నిలిపివేసింది. హిందీ సినిమాలు భార‌త్‌లో విడుద‌ల‌వ‌డానికి ముందే దుబాయ్‌లో ప్రీమియ‌ర్ షో చూసేసి, వెకిలి రివ్యూలు రాస్తుంటారు. దీంతో కేఆర్కే మంచి గుర్తింపు పొందారు. ఆయన ట్విట్టర్ ఖాతాను యాజమాన్యం నిలిపివేసింది. 
 
అమీర్‌ఖాన్ సినిమా 'సీక్రెట్ సూప‌ర్‌స్టార్' గురించి కేఆర్‌కే ఏదైనా విమ‌ర్శించాడేమోన‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ అకౌంట్ కోసం వెతికిన‌పుడు ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. సాధార‌ణంగా ట్వీట్ల‌లో అస‌భ్య ప‌ద‌జాలాన్ని, మ‌తాల‌ను, భావజాలాల‌ను కించ‌ప‌రిచే ప‌దజాలం ఉన్న‌పుడు ట్విట్ట‌ర్ ఇలా ఖాతాల‌ను నిలిపివేస్తుంది. 
 
దీంతో సినీ ప్రియులు పండ‌గ చేసుకున్నారు. ఈ దీపావ‌ళికి ట్విట్ట‌ర్ చ‌క్క‌ని బ‌హుమ‌తినిచ్చిందంటూ వ్యాఖ్య‌లు చేశారు. ట్విట్ట‌ర్‌కి ప‌ట్టిన పీడ వ‌దిలింద‌ని, క‌లుపు మొక్క‌ల‌ను ట్విట్ట‌ర్ ఏరిపారేస్తోంద‌ని కామెంట్లు చేశారు.