శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 10 ఆగస్టు 2019 (22:12 IST)

కేజీఎఫ్‌కు రెండు జాతీయ అవార్డులు-జ్యూరీకి యూనిట్ ధన్యవాదాలు

కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘కేజీఎఫ్’ రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన 66వ జాతీయ చలన చిత్రా అవార్డుల్లో.. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫైట్స్ కేటగిరిల్లో ‘కేజీఎఫ్’కు అవార్డులు దక్కాయి. 
 
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. జ్యూరీ సభ్యులకు హీరో రాక్‌స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరంగదూర్ ధన్యవాదాలు తెలిపారు. యూనిట్ సభ్యులందరి సమిష్టి కృషితోనే ఈ అవార్డులు వరించాయని చెప్పారు. కేజీఎఫ్ చాప్టర్2ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.